King Cobra Viral Video: కాటేయడానికి పరుగెత్తుకొచ్చిన 13 అడుగుల కింగ్ కోబ్రా.. ఈ వ్యక్తి ఎంత ఈజీగా హ్యాండిల్ చేశాడో చూడండి!
13 feet King Cobra attack on Snake Catcher while releasing in Forest. స్నేక్ క్యాచర్ రజాక్ షాకు ఓ 13 అడుగుల కింగ్ కోబ్రా పట్టపగలే స్టార్స్ చూపెట్టింది.
13 feet King Cobra deadly attack on Snake Catcher Razak Shah while releasing: ఈ ప్రపంచంలో నల్ల త్రాచు లేదా కింగ్ కోబ్రా అత్యంత విషపూరితమైన సర్పం. కింగ్ కోబ్రా కాటేస్తే మనిషి 15 నిమిషాల్లో చనిపోతాడు. ఒకవేళ ప్రాణం దక్కినా.. పక్షవాతం రావడం మాత్రం ఖాయం అని చాలా మంది చెబుతుంటారు. కేవలం మనుషులనే కాదు భారీ ఏనుగులు సైతం కింగ్ కోబ్రా కాటుకు బలవుతాయి. కింగ్ కోబ్రా విషం మిగతా పాముల కంటే అత్యంత విషపూరితమైనది కాకున్నా.. అది కాటేసే సమయంలో ఎక్కువ మొత్తంలో విషంను చిమ్మిస్తుంది. అందుకే ప్రమాదకరమైన కింగ్ కోబ్రాను ఎంతో అనుభవం ఉన్న స్నేక్ క్యాచర్స్ మాత్రమే పడుతుంటారు.
ఎంతో అనుభవం ఉన్న స్నేక్ క్యాచర్‌లకు కూడా కింగ్ కోబ్రా చుక్కలు చూపిస్తుంది. 12 నుంచి 18 అడుగుల ఉండే కింగ్ కోబ్రాలు అయితే అస్సలు చేతికి చిక్కవు. ఈ క్రమంలోనే స్నేక్ క్యాచర్ రజాక్ షాకు కూడా ఓ 13 అడుగుల కింగ్ కోబ్రా పట్టపగలే స్టార్స్ చూపెట్టింది. కింగ్ కోబ్రాను ఎంతో కస్టపడి పట్టి సంచిలో బంధించిన రజాక్ షా.. విడిచే సమయంలో కూడా నానా తంటాలు పడ్డాడు. అడవిలో విడిచేటప్పుడు అతడిని కాటేయడానికి మీదికి దూసుకు రాగా.. తన టెక్నీక్ సాయంతో సులువుగా తప్పించుకున్నాడు. చివరకు దాన్ని అడవిలో వదిలేశాడు.
కింగ్ కోబ్రా ఎటాక్ చేసినప్పుడు ఎలా తప్పించుకోవాలో కూడా స్నేక్ క్యాచర్ రజాక్ షా వీడియో చూపించాడు. తోకను పట్టుకుని సాధ్యమైనంత వరకు పైకి ఎత్తితే పాము కాటేయలేదని రజాక్ చెపుతున్నాడు. పైకి ఎత్తినప్పుడు పాముకు గ్రిప్ దొరకక కాటేయడానికి ప్రయత్నించదని చెప్పాడు. పాము సగభాగంను గాల్లోకి ఎత్తితే ఏమీ చేయదట. పాము తల భాగం భూమి మీద ఉన్నపుడు కాటేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని రజాక్ చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబందించిన వీడియోను Razak Shah Snake Rescuer అనే యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Also Read: ప్రపంచకప్‌లు వస్తుంటాయి పోతుంటాయి.. అతడు మరోసారి గాయపడితే కెరీర్‌కే ప్రమాదం: సల్మాన్
Also Read: BRS IN AP: బీఆర్ఎస్ పార్టీతో వైసీపీకి లాభమా? కేసీఆర్, జగన్ మధ్య ఆ డీల్ కుదిరిందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook