King Cobra Viral Video: ఒక్కసారిగా దూసుకువచ్చిన కింగ్ కోబ్రా.. నరాలు కట్ అయ్యే వీడియో
Today Viral Video: ఇటీవల పాములకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టకుంటున్నాయి. సోషల్ మీడియో పోస్ట్ చేసిన వెంటనే క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. స్నేక్ క్యాచర్లు భారీ కింగ్ కోబ్రాలను సైతం ఎలాంటి భయం లేకుండా అలవోకగా పట్టేస్తున్నారు.
Today Viral Video: కింగ్ కోబ్రాను వీడియోలో చూస్తేనే భయమేస్తోంది. కానీ అదే దగ్గర నుంచి చూస్తూ.. దాని తోక పట్టుకునేందుకు ప్రయత్నిస్తే.. ఇంకేమైనా ఉందా.. అంత ధైర్యం ఎవరికి ఉందని అంటారు. అయితే చాలా మంది స్నేక్ క్యాచర్లు ఎంతపెద్ద పామునైనా చాచక్యంతో బంధిస్తారు. తమ వద్ద ఎలాంటి పరికరాలు లేకున్నా.. అలవోకగా చేతులతో పట్టేస్తారు. ఇలాంటి వీడియోలు ఇటీవల నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా అలాంటి ఓ వీడియోను నెట్టింట వైరల్ అవుతోంది. ఓ యువకుడు కింగ్ కోబ్రాను పట్టుకునేందుకు ప్రయత్నించగా.. అది వెంటనే తెరుకునే దాడి చేసేందుకు ప్రయత్నించింది. అయితే ఆ యువకుడు వెంటనే దాని నుంచి దూరం పోయాడు.
ఈ వీడియోను @insta_dada_n.s అనే ఇన్‌స్టా హ్యాండిల్ కింద షేర్ చేశారు. ఈ గ్రిప్పింగ్ షార్ట్ క్లిప్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. వీడియోలో ఓ బాత్రూమ్ డోర్ బయట తిరుగుతున్న కింగ్ కోబ్రా తోకను గుర్తించిన యువకుడు.. దానిని పట్టుకునేందుకు ధైర్యంగా చేయిచాపాడు. చేతితో తోక పట్టుకుని వెనక్కి లాగేందుకు ప్రయత్నించగా.. అది వెంటనే దూసుకువచ్చింది. దీంతో తోకను వదిలిపెట్టి దూరంగా వచ్చాడు. పాము మీదకు దూసుకువచ్చే క్రమంలో నరాల్ కట్ అయ్యేంత పని అయిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
కింగ్ కోబ్రా ఊహించని విధంగా మీదకు దూసుకురావడంతో భయంతో అతను వెనక్కితగ్గాడు. బాత్రూమ్ చిన్నగా ఉండడంతో ఆ పాము లోపలి నుంచి వెనక్కి తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో షేర్ చేసినప్పటి నుంచి 61 వేలకుపైగా వ్యూస్ వచ్చాయి. క్లిప్ మరి పెద్దగా ఆశ్చర్యపరిచే విధంగా లేకపోయినా.. కింగ్ కోబ్రా సడెన్ అటాక్ ఆకట్టుకుంటోంది. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
Also Read: Banks Interest Rates: సీనియర్ సిటిజన్ల ఎఫ్‌డీలపై 9 శాతంపైగా వడ్డీ చెల్లిస్తున్న బ్యాంకులివే
Also Read: Jio AirFiber: మరో 115 నగరాల్లో ఎయిర్ ఫైబర్ సేవలు, ఈ ప్లాన్స్ తీసుకుంటే ఓటీటీ సేవలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి