COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

King Cobra Viral Video: సోషల్ మీడియా ప్రస్తుతం ఓ ప్రపంచంలా తయారైంది. నెటిజన్లు అన్ని రకాల విషయాలు చిటికేలో తెలుసుకోగలుగుతున్నారు. అంతేకాకుండా ఎప్పుడు చూడలేని సన్నివేశాలు ఇందులో చూడగలుగుతున్నారు. అయితే సోషల్‌ మీడియాలో ప్రస్తుతం జంతువులకు సంబంధించి వీడియోలే ఎక్కువగా వైరల్‌ అవుతున్నాయి. ఈ దృశ్యాలు కొందరిని ఆశ్చర్యపరిచితే మరికొందరిని భయాందోళను గురి చేస్తున్నాయి. అయితే ఈ వీడియోల్లో పాములకు సంబంధించినవే ఎక్కువగా ఉంటున్నాయి. వీడియోల్లో కింగ్‌ కోబ్రా, అతి భయంకరమైన కొండచిలువలు కలిగిన వీడియాను నెటిజన్లు చూసేందుకు ఇష్టపడుతున్నారు. సాధరణంగా కొండ చిలువలు 12 నుంచి 20 అడుగులు పొడవుతో ఉంటాయి. ఇవి మానుషులకు హాని కలిగించవచ్చు.  





ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అన్ని జంతువులు మనుషుల్లా ఎంతో కొంత ప్రేమను కలిగి ఉంటాయి. అయితే అందులో భాగంగానే ఈ పాముకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్‌గా మారుతోంది. మీరు ఈ వీడియోను చూస్తే.. ప్రేమ కలిగిన రెండు కోబ్రాలు ఒకదానికొకటి కౌగిలించుకుని ఎంతో ప్రేమతో నాగిణి డ్యాన్స్‌ చేస్తుంటే.. మధ్యలో ఒక పాము వచ్చి ఆ డ్యాన్స్‌ను చెడగొట్టేందుకు ప్రయత్నించింది. అయితే రెండు పాముల మధ్య ఉన్న పాము పైకి తల పెట్టి డ్యాన్స్‌ చేయడం మొదలు పెట్టింది. ఇలా మూడు పాములు కలిసి డ్యాన్స్‌ చేయడం మొదలు పెట్టాయి. ఇలా మూడు పాముల సన్నివేశాలు నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి.


అయితే చాలా మందికి అశ్చర్యం కలగవచ్చు. పాములు కూడా ప్రేమలో పడతాయని.. అవును అంటున్నారు నిపుణులు. పాములకు మనుషుల్లా ప్రేమ ఉంటుందని.. అవి కూడా ఇతర మనుషులాగా ప్రేమించుకోగలుగుతాయని నిపుణులు తెలుపుతున్నారు. ఇలా కలిసి డ్యాన్స్‌ చేయడం చాలా అరుదని వారు అంటున్నారు. అయితే ఈ పాములకు సంబంధించిన వీడియో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. అంతేకాకుండా ఈ వీడియోను చాలా మంది సోషల్‌ మీడియా వినియోగదారులు లైక్‌ చేస్తున్నారు. ఇప్పటికీ ఈ వీడియోకి 136 వేల మంది లైక్‌ చేయగా.. చాలా మంది వారీ అభిప్రాయలను కామెట్లలో తెలుపుతున్నారు. ఈ వీడియోను beautiful_new_pix  అనే ఇంస్టాగ్రామ్‌ ప్రోఫైల్‌ నుంచి షేర్‌ చేశారు.


  


Also Read : Chiranjeevi-Garikapati : మళ్లీ వివాదం షురూ.. గరికపాటి మీద చిరంజీవి పరోక్ష సెటైర్లు.. వీడియో వైరల్


Also Read : Jagadish Reddy: మంత్రి జగదీశ్ రెడ్డికి ఈసీ ఝలక్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి