కాటేయడానికి మీదికి దూసుకొచ్చిన 14 అడుగుల కింగ్ కోబ్రా.. ఈ వ్యక్తి ఎలా డీల్ చేశాడో చూడండి!
Snake Catcher Pawan Naika catch 14 feet King Cobra in Karnataka. కర్నాటకలోని కుమటా తాలూకాలోని మస్తిహల్లా గ్రామంలో 14 అడుగుల పొడవు, 9.5 కిలోల బరువున్న కింగ్ కోబ్రాను స్నేక్ క్యాచర్ పవన్ చాలా సులువుగా పట్టేశాడు.
Snake Catcher Pawan Naika Caught 14 feet King Cobra in Karnataka: ప్రపంచములో అత్యంత పెద్ద, పొడవైన విష సర్పాలలోనల్లత్రాచు లేదా కింగ్ కోబ్రా ఒకటి. కింగ్ కోబ్రా సుమారు 12 నుంచి 18 అడుగుల పొడవు, భారీ శరీరంను కలిగి ఉంటుంది. నల్లగా ఉంటుంది కాబట్టి.. కింగ్ కోబ్రాను చూడడానికే భయం పుడుతుంది. ఇక పడగెత్తిందంటే దాదాపు ఆరు అడుగులు పైకి లేస్తుంది. పడగెత్తినపుడు ఎదురుగా ఉన్న మనిషి కళ్లల్లోకి అది ఉగ్రరూపంతో చూస్తుంది. ఆ సీన్ ఊహించుకుంటేనే.. ఒళ్లు జలదరిస్తుంది. అలాంటి కింగ్ కోబ్రాను ఓ వ్యక్తి తన టెక్నీక్‌తో చాలా సులువుగా పట్టుకున్నాడు.
కర్నాటకలోని కుమటా తాలూకాలోని మస్తిహల్లా గ్రామంలో 14 అడుగుల పొడవు, 9.5 కిలోల బరువున్న కింగ్ కోబ్రా హల్చల్ చేసింది. మస్తిహల్లా గ్రామంలోని గణపుగౌడ్ అనే వ్యక్తి తన తోటలో వారం రోజులుగా కింగ్ కోబ్రా సంచరిస్తుండడంతో.. అతడు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. వారు పాములు పట్టే వ్యక్తి పవన్ నాయకకు సమాచారం ఇచ్చారు. వెంటనే అతడు గణపుగౌడ్ తోటకు చేరుకొని పామును చూశాడు.
కింగ్ కోబ్రాను పట్టుకునేందుకు స్నేక్ క్యాచర్ పవన్ ప్రయత్నించగా.. కాటేయడానికి అతడి మీదికి దూసుకొచ్చింది. కొద్దిదూరం పరుగెత్తిన పవన్.. ఆపై దాని టెక్నీక్‌తో అదుపు చేశాడు. అనంతరం పాము తోకను పట్టుకుని చాలా ప్రయత్నాల అనంతరం దాన్ని ఓ సంచిలో బంధించాడు. అనంతరం దేవీమనఘట్ట అడవుల్లో దాన్ని విడిచిపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఈటీవీ భారత్ (ETV Bharat) తన యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసింది. ఈ వీడియోకి లైకుల, షేర్ల వర్షం కురుస్తోంది.
Also Read: మాల్దీవులకు రష్మిక, విజయ్.. సంధింగ్ సంధింగ్ అంటూ మళ్లీ రచ్చ!
Also Read: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. సినిమా రిలీజ్ రోజే కన్నుమూసిన సీనియర్ యాక్టర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook