పాడుబడిన ఇంట్లో 7 కిలోల కింగ్ కోబ్రా.. బుసలు కొడుతూ మీదికివచ్చినా భయపడని అమ్మాయి! ఎలా పట్టిందో చూడండి
Viral Video, Woman caught Big King Cobra in old house. ఓ లేడీ స్నేక్ క్యాచర్ ప్రమాదకర కింగ్ కోబ్రాను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా.. అది ఆమె మీదకు ఒక్కసారిగా దూసుకువచ్చింది.
Brave Woman caught 7kg King Cobra in old house: ప్రపంచంలో అత్యంత పెద్ద, పొడవైన విష సర్పములలో నల్లత్రాచు లేదా రాచనాగు లేదా కింగ్ కోబ్రా ఒకటి. సాధారణంగా కింగ్ కోబ్రా 18.5 అడుగుల (5.7 మీటర్) పొడవు పెరుగుతుంది. బరువు సుమారుగా 44 పౌండ్లు (8 కిలోలు) ఉంటుంది. కింగ్ కోబ్రా తన పొడవులో మూడవ వంతు వరకు పడగ ఎత్తగలదు. భారీ కింగ్ కోబ్రా పడగ పైకెత్తితే ఆరు అడుగుల ఎత్తుండి.. ఎదురుగా నిలిచిన మనిషి కళ్ళలోనికి ఉగ్రంగా చూస్తుంది. దాంతో ఎవరైనా భయపడిపోతారు. స్నేక్ క్యాచర్ మాత్రమే కింగ్ కోబ్రాను పట్టుకుంటాడు. ఒక్కోసారి వారికి కూడా చుక్కలు చూపిస్తుంది. అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఓ లేడీ స్నేక్ క్యాచర్ ప్రమాదకర కింగ్ కోబ్రాను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా.. అది ఆమె మీదకు ఒక్కసారిగా దూసుకువచ్చింది. ఓ పాడుబడిన ఇంట్లో 7 కిలోల కింగ్ కోబ్రా తిరుగుతుండగా.. లేడీ స్నేక్ క్యాచర్ కంట పడింది. వెంటనే ఆమె దాని తోకను పట్టుకుని లాగగా.. అది ఒక్కసారిగా కాటేయడానికి ముందుగా దూసుకొస్తోంది. కింగ్ కోబ్రా వచ్చే వేగంకు స్నేక్ క్యాచర్ కూడా హడలిపోయి అక్కడి నుంచి దూరంగా పారిపోతుంది.
మరలా దగ్గరకు వచ్చిన ఆ లేడీ స్నేక్ క్యాచర్ కింగ్ కోబ్రాను పట్టుకోవడానికి చాలా ప్రయత్నిస్తుంది. ఆమెకు మరో ఇద్దరు స్నేక్ క్యాచర్స్ సాయం చేస్తారు. వారిని కూడా అది ముప్పుతిప్పలు పెడుతుంది. చివరకు ఒకరు కింగ్ కోబ్రా తలను కర్ర సాయంతో అదిమి పట్టగా.. లేడీ స్నేక్ క్యాచర్ చాకచక్యంగా దానిపై సంచి వేసి బంధిస్తుంది. ఇందుకు సంబందించిన వీడియోను 'KingCobra Hunter' అనే యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేశారు. నెల రోజుల క్రితం పోస్ట్ చేసిన ఈ వీడియోకి 25 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.
Also Read: King Cobra Viral Video: ఒకే బిలంలో 6 కింగ్ కోబ్రాలు.. ఎంత ఈజీగా పట్టాడో! మీరే చూడండి
Also Read: Jupiter Transit 2023: బృహస్పతి సంచారం.. కొత్త ఏడాదిలో ఈ ఆరు రాశుల వారికి అంతా శుభమే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook