Belly Dance Viral Video: బెల్లీ డ్యాన్స్.. అరబ్ దేశాల్లో ఫేమస్ డ్యాన్స్. ఇటీవలే కాలంలో బాలీవుడ్ లో పలు హీరోయిన్లు బెల్లీ డ్యాన్సులతో ఫేమస్ అయ్యారు. ఇటీవలే స్టార్ హీరోయిన్ నోరా ఫతేహి.. కుసు కుసు అనే పాటకు బెల్లీ డ్యాన్స్ చేసి ఆకట్టుకుంటోంది. ఇప్పుడా పాటకు సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్లు అలాంటి స్టెప్పులతో కాపీ కొడుతూ ఫేమస్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ‘కుసు కుసు’ పాటకు ఓ యువతి బెల్లీ డ్యాన్స్ చేసి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సీక్వెల్ లోనూ బెల్లీ డ్యాన్స్..


జాన్ అబ్రహం హీరోగా నటించిన ‘సత్యమేవ జయతే’ చిత్రం బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీలోని ఐటెం సాంగ్.. ‘దిల్ బర్’లో బెల్లీ డ్యాన్స్ తో ఒక్కసారి క్రేజ్ సంపాదించి.. స్టార్ గా ఎదిగింది హీరోయిన్ నోరా ఫతేహి. ఇప్పుడా సినిమాకు సీక్వెల్ గా ‘సత్యమేవ జయతే 2’ తెరకెక్కుతోంది. అయితే ఇందులోనూ ఐటెం సాంగ్ ను నోరా ఫతేహి తోనూ రూపొందించింది చిత్రబృందం. ‘కుసు కుసు’ అంటూ సాగే ఈ ఐటెం సాంగ్ లోనూ నోరా ఫతేహి.. మరోసారి బెల్లీ డ్యాన్స్ తో అలరించింది.


ఇటీవలే సోషల్ మీడియాలో విడుదలైన ఈ పాట పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడా పాటకు క్రేజ్ రావడం వల్ల సోషల్ మీడియాలో ట్రెండ్ గా నిలిచింది. దీంతో ఆ పాటకు కొందరు అమ్మాయిలు బెల్లీ డ్యాన్స్ లు చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ అమ్మాయి చేసిన బెల్లీ డ్యాన్స్ వీడియో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. ఆమె డ్యాన్స్ కు నెటిజన్లు ఫిదా అయ్యారు. కొందరు నెటిజన్లు ఆమె డ్యాన్స్ ను మెచ్చుకోగా.. మరి కొందరు నోరా ఫతేహి కంటే బాగా బెల్లీ డ్యాన్స్ చేశావంటూ కామెంట్స్ చేస్తున్నారు. 



ఇంతకీ ఆ యువతి ఎవరంటే?


ఉత్తరాఖండ్ కు చెందిన సోనాలి కైంతుర అనే యువతి.. ‘సత్యమేవ జయతే 2’ సినిమాలోని నోరా ఫతేహి బెల్లీ డ్యాన్స్ చేసిన ‘కుసు కుసు’ పాటకు తనదైన శైలీలో బెల్లీ డ్యాన్స్ చేసింది. ఆ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా.. ఆ వీడియోకు విపరీతమైన క్రేజ్ లభించింది. దీంతో అది వైరల్ గా మారింది. నవంబరు 28న ఆ వీడియోను పోస్టు చేయగా.. 78 వేలకు పైగా వీక్షణలు దక్కించుకుంది. దీంతో ఒక్కసారిగా ఆ యువతి సెలెబ్రిటీగా మారిపోయింది. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోను మీరూ చూసేయండి.


ALso Read: Hair Dry With Pressure Cooker: ప్రెషర్ కుక్కర్ తో హెయిర్ డ్రై.. సోషల్ మీడియాలో వీడియో వైరల్


Also Read: Scary Snake Video: పిట్ట కొంచెం కూత ఘనం అంటే ఇదేనేమో.. చిన్న పాము పెద్ద గుడ్డు స్వాహా..!! 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook