Lady Beat Cab Driver in Delhi: దేశ రాజధానిలో నడిరోడ్డుపై ఓ మహిళ వీరంగం సృష్టించింది. క్యాబ్ డ్రైవర్‌ను కొట్టి, భూతులు తిట్టిన వీడియో వైరల్ అవుతుంది. ఈ  వీడియోలో, స్కూటీ పైన ఉన్న మహిళ.. క్యాబ్ డ్రైవర్ కాలర్‌ పట్టుకుని, చెంప మీద కొట్టడమే కాకుండా, పిడిగుద్దులు గుద్దింది. క్యాబ్ డ్రైవర్ ఫిర్యాదు మేరకు మహిళపై కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

RTO నుండి సేకరిస్తున్న సమాచారం 


సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో ఢిల్లీలోని పటేల్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వీడియో తీసిన వ్యక్తి ఆమె నడిపిన స్కూటీ నంబర్ కూడా వీడియో తీయటంతో పోలీసులు RTO ఆఫీసు ద్వారా ఆమె గురించిన సమాచారం కోసం వెతికే పనిలో పడ్డారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. బ్లూ కలర్ స్వెటర్ వేసుకున్న మహిళ... క్యాబ్ డ్రైవర్ ను కారులోంచి లాగి కొట్టింది.. ఈ వీడియో తెగ వైరల్ అవ్వగా మాస్క్ ధరించిన మహిళ కోసం వెతుకుతున్నామని తెలిపారు. 


Also Read: కలల జ్యోతిషశాస్త్రం: పదే పదే మరణించిన వారు కలలో కనపడుతున్నారా..?? అయితే దానికి అర్థం ఇదే!


మౌనంగా నిలబడ్డ మరో యువతి .. 


మరో వైపు అదే స్కూటీపై ఉన్న మరో మహిళ మౌనంగా ఉంది. అక్కడున్న వారి మాటలను బట్టి చూస్తే... తప్పు కొట్టిన మహిళదే అని అర్థం అవుతుంది అయితే అక్కడ ఉన్న మిగతా వ్యక్తులు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 




డ్రైవర్ ను ఈడ్చుకొచ్చిన యువతి


ఈ సంఘటన వెస్ట్ పటేల్ నగర్‌లోని కస్తూరి లాల్ ఆనంద్ మార్గ్‌లోని బ్లాక్-22లో జరిగింది. ఆ మహిళ మరో యువతితో కలిసి స్కూటీపై వెళ్తోంది. రద్దీ కారణంగా క్యాబ్ డ్రైవర్ ఆమెకు వెళ్లటానికి అవకాశం ఇవ్వకపోవటంతో... ఆగ్రహానికి గురైన మహిళ.. కారు ముందు స్కూటీ ఆపి, అతడిని క్యాబ్ లోంచి చొక్కా పట్టుకొని లాక్కొచ్చి.. నడి రోడ్డుపై రచ్చ రచ్చ చేసింది. 


Also Read: ఐరాసలో పాకిస్తాన్ చెంప చెళ్లుమనిపించిన భారత ప్రతినిధి డాక్టర్ కాజల్ భట్ .. వీడియో


ఇదంత చూస్తున్న ఇతరులు.. ఆమెకు వ్యతిరేఖంగా నిరసన తెలపడంతో వారిపైన కూడా ఆమె విరుచుకుపడింది. చుట్టూ ఉన్న వారిని తిట్టడమే కాకుండా, చంపేస్తానని బెదిరించింది. క్యాబ్ డ్రైవర్ ఎటువంటి అసభ్యకరంగా ప్రవర్తించకముందే.. ఆ యువతి డ్రైవర్ చొక్కా పట్టుకొని అతడిని చెంప దెబ్బలు కొట్టడం వీడియోలో మనం చూడవచ్చు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook