Latest Viral News In Social Media: అందరూ సాధరణంగా గుడికి వెళ్లేటప్పుడు కొబ్బరి కాయతో పాటు పూలు, పండ్లు పట్టుకుని వెళ్తారు. మరికొంతమందైతే స్వీట్స్‌ కూడా తీసుకువెళ్తారు. ఎవరికి తోచిన విధంగా వారు ఆయా నైవేద్యాలు తీసుకెళ్తుంటారు. కానీ ఓ ఆలయంలో వింతగా నైవేద్యాలకు బదులుగా బండరాళ్లను తీసుకుపోవడం ఆనవాయితిగా వస్తోందట. ఇక్కడి వచ్చే భక్తులు అందరూ స్వామివారి ముందు బండరాళ్లను ఉంచి, పూజా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఇలా నాలుగు వారాల పాటు చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని అక్కడి ప్రజల నమ్మకం. ఇంతకీ ఈ గుడి ఎక్కడ ఉందో..ఇలా దేవుడిని వింతగా పూజించడానికి కారణాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఆలయం కర్ణాటకలోని బేవినహళ్లి సమీపంలో ఉంటుంది. అక్కడి ప్రజలు ఈ గుడిని బసప్ప పేరుతో పిలుస్తారు. ఇక్కడికి వచ్చే భక్తులంతా దేవుడికి రాళ్లను రప్పలను తీసుకువచ్చి సమర్పిస్తారు. అయితే పురాణగాథ ప్రకారం..దేవుళ్లకు రాళ్లంటే ఎంతో ఇష్టమట..దీంతో ఈ ఆలయాని సమీపంలో ఉండే ప్రజలంతా అడవి నత్తకు చిన్న చిన్న బండ రాళ్లను సమర్పించి కోరికలు కోరుకుంటారని సమాచారం. ఇలా భక్తి శ్రద్ధలతో స్వామికి బండ రాళ్లతో పూజా కార్యక్రమాలు చేయడం వల్ల సులభంగా కోరుకున్న కోరికలు నెరవేరుతాయని స్థానికులు చెబుతున్నారు. 


Also Read: Child Marriage: రూ.25 వేలకు ఆశపడి కూతురికి బాల్య వివాహం.. ట్విస్ట్ ఇచ్చిన బాలిక..


ఇక్కడి వెలసిన అడవి బసప్ప అన్ని దేవతల కంటే భిన్నమైన దేవుడని అక్కడి ప్రజలు చెప్పుకుంటారు. అయితే ఇక్కడ ఉండే విగ్రహాన్ని ఎవరు ప్రతిష్ట చేయలేరట..స్వయంగా భూమి నుంచే ఉద్భవించదని అక్కడి ప్రజలు చేప్పుకుంటారు. అందుకే ఆ చుట్టు పక్కల ఉండే జనాలు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని పూజా కార్యక్రమాలు చేస్తారు. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల భక్తులు కూడా ఇక్కడికి చేరుకుని పూజా కార్యక్రమాలు చేస్తారు. ఇక కోర్టు కేసులతో బాధపడుతున్నవారు  బసప్పకు నాలుగు రాళ్లు సమర్పించి వేడుకుంటే సులభంగా విజయాలు సాధిస్తారని అక్కడి ప్రజలు చెబుతున్నారు. 


కష్టాల్లో ఉన్నప్పుడు స్థానికంగా ఉండే ప్రజలు తప్పకుండా ఆలయానికి వెళ్లి రాళ్లను సమర్పిస్తారని సమాచారం. అంతేకాకుండా కొంతమంది అక్కడ పూజించిన రాళ్లను ఆలయం చుట్టు పెడతారని స్థానికులు చెబుతున్నారు. సుదూర ప్రాంతం నుంచి వచ్చిన భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేస్తారని, ఇలా పూజలు చేయడం వల్ల ఎలాంటి సమస్యలైనా సులభంగా తీరిపోతాయని భక్తుల నమ్మకం.


Also Read: Child Marriage: రూ.25 వేలకు ఆశపడి కూతురికి బాల్య వివాహం.. ట్విస్ట్ ఇచ్చిన బాలిక..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి