Leopard Viral Videos: సోషల్ మీడియాలో తాజాగా చిరుతపులికి సంబంధించిన ఒక వీడియో ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను నిశితంగా పరిశీలిస్తే.. అక్కడ మంచంపై ఒక యువకుడు దుప్పటి కప్పుకుని పడుకున్నాడు. అతడు గాఢ నిద్రలో ఉన్నాడు. అప్పుడే ఒక ఊహించని ఘటన చోటుచేసుకుంది. అతడికి సమీపంలోనే ట్రక్కులు పార్కింగ్ చేసి ఉండటం కనిపిస్తోంది. ఆ ట్రక్కుల్లో ఒక ట్రక్కు కింది నుంచి ఒక చిరుతపులి అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చింది. ఎవ్వరికీ ఎలాంటి అనుమానం రాకుండా నిశబ్ధంగా వచ్చి నేరుగా అక్కడే నిద్రిస్తున్న కుక్క మెడ పట్టుకుని పరుగు అందుకుంది. భయంతో కుక్క తిరగబడే ప్రయత్నం చేసినప్పటికీ.. కుక్కకు తిరగబడే ప్రయత్నం కాదు కదా కనీసం అరిచే అవకాశం కూడా ఇవ్వకుండా కుక్క గొంతుని తన నోట కరుచుకుని అక్కడి నుంచి పరుగెత్తింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కుక్కను నోట కర్చుకున్నప్పుడు అయిన శబ్ధానికి అక్కడే పడుకున్న యువకుడు నిద్ర లేచి చూసినప్పటికీ.. అప్పటికే ఆ చిరుత పులి అతడి కంటికి కూడా కనిపించకుండా మాయమైంది. దీంతో అసలు ఏం జరిగిందో అర్థం కాక ఆ యువకుడు తన దిండు కిందున్న సెల్ ఫోన్ తీసి అక్కడి సీసీటీవీ కెమెరాలని పరిశీలించాడు. అందులో కనిపించిన దృశ్యం చూసి షాకవడం అతడి వంతయ్యింది. ఒకవైపు కుక్కను చిరుతపులి పట్టుకుపోయిందే అనే బాధ.. మరోవైపు ఒకవేళ ఆ చిరుతపులి తనపైనే దాడి చేసి ఉండుంటే తన పరిస్థితి ఏంటనే భయం.. వెరసి ఆ యువకుడికి ఎదురైన ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటనను సోషల్ మీడియాలో కళ్లారా చూసిన చాలామంది ఫీలింగ్ కూడా ఇంచుమించు అలాంటిదే.  



 


మే 15న పూణెలోని జున్నార్‌లో జరిగి ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాన్ని యానిమల్ రెస్క్యూ సెంటర్ రెస్‌క్యూ ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు నేహా పంచమియా తన అధికారిక ట్విట్టర్ ఱానాయల @neha_panchamiya లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూడ్డానికి ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఈ ఘటనను చూశాకా.. అటవీ ప్రాంతంలో ఆరు బయట నివసించాలంటే జనం హడలిపోయేలా ఉన్నారు. ఆకలితో అక్కడికి వచ్చిన ఆ చిరుత పులికి శునకం కనిపించింది కాబట్టి దానిని ఎత్తుకెళ్లింది.. మరి ఒకవేళ అక్కడ వేరే ఆహారం ఏదీ కనిపించకుండా మనిషి ఒక్కడే కనిపించి ఉంటే అతడిపై దాడి చేసేదే కదా అంటున్నారు ఈ వీడియో చూసిన నెటిజెన్స్.