Leopard Entered Ghaziabad District Court: ఢిల్లీని ఆనుకుని ఉన్న ఘాజియాబాద్ జిల్లా కోర్టులో చిరుతపులి కలకలం సృష్టించింది. జిల్లా కోర్టు పరిసరాల్లోకి ప్రవేశించిన చిరుతపులి.. అక్కడ హల్ చల్ చేసి పలువురిపై దాడి చేసింది. కోర్టు వేళలు ముగిసే సమయంలో బుధవారం సాయంత్రం 4 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. రాజ్ నగర్ లో ఉన్న జిల్లా కోర్టులోకి చిరుతపులి ప్రవేశించి అని సమాచారం అందుకున్న ఘాజియాబాద్ పోలీసులు.. జిల్లా అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. చిరుతపులిని పట్టుకునేందుకు పోలీసులు, అటవీ శాఖ అధికారులు రాజ్ నగర్ లోని జిల్లా కోర్టుకు చేరుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోలీసులు, అటవీ శాఖ అధికారులు కోర్టుకు చేరుకునేలోపే కోర్టు ఆవరణలో కలియ తిరిగిన పులి.. పలువురిపై దాడి చేసి గాయపర్చింది. కోర్టు ఆవరణలో చిరుతపులి దాడిలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఘాజియాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఘాజియాబాద్ జిల్లా కోర్టు ఆవరణలోకి చిరుత పులి ప్రవేశించిన ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.



 


ఇదిలావుంటే ఇదే ఘాజియాబాద్ జిల్లాలో జనవరి 17న ఢిల్లీ - మీరట్ ఎక్స్‌ప్రెస్ వేపై వేగంగా వెళ్తున్న ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ చిరుతపులి మృత్యువాత పడింది. కల్చీరా గ్రామంలో చిరుతపులి రోడ్డు దాటుతుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మగ చిరుత పులి వయస్సు 5 ఏళ్లు ఉంటుందని అటవీ శాఖ అధికారులు అంచనా వేశారు.


ఇది కూడా చదవండి : Slowest Train in India: ఈ ట్రైన్ స్పీడ్ గంటకు 10 కిమీలే.. అయినా తగ్గని భారీ డిమాండ్..


ఇది కూడా చదవండి : Tiger Viral Video: రోడ్డు దాటేందుకు తిప్పలు పడుతున్న టైగర్ వైరల్ వీడియో



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook