Lion Shocking Video: అక్కడో నాలుగైదు సింహాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఓ డ్రమ్ రంధ్రంలో సింహం తల ఇరుక్కుపోవడంతో కిందామీదా పడుతున్నాయి. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోషల్ మీడియాలో సింహాలు, పులులకు సంబంధించిన చాలా వీడియోలు వెలుగుచూస్తుంటాయి. సింహం ఎక్కడైనా సింహమే కదా. సింహం రాజసం మరెవ్వరికీ రానేరాదు. జూలో ఉన్నా అడవిలో ఉన్నా సింహం సింహమే. జూకు ఎక్కువగా జనం వచ్చేది సింహాల్ని చూసేందుకే. ఈ వీడియోలో మూడు సింహాలు కలిసి మల్లగుల్లాలు పడుతున్న దృశ్యాలు చూడవచ్చు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక పెద్ద ప్లాస్టిక్ డ్రమ్ము రంధ్రంలో ఓ సింహం ముఖం ఇరుక్కుపోయింది. అందుకే ఈ పరిస్థితి.


ఈ వీడియో చూస్తే మీరు కూడా కంగారు పడతారు. కానీ వీడియో మాత్రం కాస్త ఫన్నీగానే ఉంది. ఓ పెద్ద ప్లాస్టిక్ డబ్బాకు ఉన్న చిన్న రంధ్రంలో ఓ సింహం ముఖభాగం ఇరుక్కుపోతుంది. దాంతో అందులోంచి తన ముఖం బయటకు తీసేందుకు ఆ సింహం పడే తిప్పలు వర్ణణాతీతం. చూసేందుకు చాలా ఫన్నీగా ఉన్న వీడియో ఇది. ఆ సింహం చుట్టూ మరో రెండు సింహాలు చేరుతాయి. ఆ సింహం ముఖాన్ని ప్లాస్టిక్ డబ్బా నుంచి విడిపించేందుకు ప్రయత్నిస్తాయి. కాస్సేపు వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తాయి. ఎంత ప్రయత్నించినా సింహం ముఖం ఆ రంధ్రంలోంచి బయటకు రాదు. ఇక చేసేది లేక ఆ సింహాన్ని అలా వదిలేసి జారుకుంటాయి.



ఈలోగా ఆ రెండు సింహాలకు ఓ మాంసం ముక్క లభిస్తుంది. అది చూసి..అన్నీ మర్చిపోయి తీసుకుని అక్కడ్నించి లాగించేస్తాయి. ఇక డబ్బా రంధ్రంలో ఇరుక్కుపోయిన సింహం కాస్సేపు అటూ ఇటూ దొర్లుతుంది. విసుగు చెంది..డబ్బాతోనే అక్కడ్నించి పరుగు తీస్తుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Also read: Rabbit- Snake Fight: ప్రమాదకరమైన పాముతో చిన్న కుందేలు ఫైట్, వీడియో వైరల్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook