Lion escapes from dangerous Crocodile in Water: సోషల్‌ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో ఎక్కువగా జంతులకు సంబంధించి ఎన్నో వీడియోలు ఉంటాయి. ముఖ్యంగా సింహం, చిరుత, జింక, మొసలి, ఏనుగులకు సంబందించినవి జనాలను ఎక్కువగా ఆకర్షిస్తుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని నవ్వులు పూయించే వీడియోలు ఉంటాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియో కాస్త భయానకరంగా ఉంది. ఓ మొసలి నుంచి ఓ సింహం తన ప్రాణాలను కాపాడుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సింహం మరియు మొసలి రెండూ చాలా ప్రమాదకరమైన జీవులు. అడవిలో సింహం రారాజు. దాని ముందు ఏ ఇతర జంతువు నిలబడలేదు. అదే విధంగా నీటిలో మొసలి రాజు. నీటిలో ఉన్న మొసలిని ఇతర జీవులు ఏమీ చేయలేవు. మొసలి ప్రత్యేకత ఏమిటంటే.. అది భూమిపై మరియు నీటిలో కూడా జీవించగలదు. అయితే సింహం మరియు మొసలి రెండూ ముఖాముఖిగా పోటీపడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అలాంటి సీన్ తాజాగా జరిగింది. 


వైరల్ అవుతున్న ఈ వీడియోలో సింహం నది ఒడ్డున ఉంటుంది. అది ఆవల ఒడ్డుకు వెళ్లేందుకు నీటిలోకి దిగుతుంది. అప్పటికే కాచుకుని ఉన్న ఓ మొసలి.. సింహం వెనుక కొంచెం దూరం వెళుతుంది. మెల్లగా సింహం దగ్గరకు వచ్చి మెడ అందుకుంటుంది. ఈ ఆకస్మిక దాడితో సింహం కంగారుపడుతుంది. సింహం తప్పించుకునే ప్రయత్నం చేయగా.. మొసలి పట్టు సడలిన వెంటనే అది పారిపోతుంది. బతుకు జీవుడా అనుకుంటూ సింహం అక్కడి నుంచి ఒడ్డుకు వెళ్లిపోతుంది. 



సింహం, మొసలికి సంబందించిన సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్  అయింది. మొసలి నుంచి తన ప్రాణాలను కాపాడుకున్న సింహం ఎలా పారిపోయిందో ఈ వీడియోలో చోడోచ్చు. ఈ వీడియోను lionknew అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేయబడింది. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ షాకింగ్ వీడియోకి యూట్యూబ్‌లో భారీ వ్యూస్‌, లైక్స్ , కెమెంట్స్ వచ్చాయి. 


Also Read: మద్యం మత్తులో మరో యువతి మెడలో దండేసిన వరుడు.. వధువు ముందే చెప్పు దెబ్బలు! చివరికి ఏమైందంటే  


Also Read: Sammathame Tickets: మరికొన్ని గంటల్లో 'స‌మ్మ‌త‌మే' సినిమా రిలీజ్.. కామెంట్ చేస్తే ఫ్రీగా టికెట్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.