Funny Video: నువ్వు నాకు నచ్చావ్ సినిమా చూశారు కదా ? అయితే అందులో బ్రహ్మానందం ఓసారి జాయింట్​ వీల్ ఎక్కినప్పుడు వచ్చే సీన్ గుర్తుండే ఉంటుంది. జాయింట్​ వీల్ ఎక్కేటప్పుడు అసలు భయమంటే ఏమిటో తెలీనట్లు మాట్లాడి.. తీరా అది తిరుగుతున్నప్పుడు బ్రహ్మానందం అరుపులు కేకలతో హంగామా చేయడం కడుపుబ్బా నవ్వించింది. ఆపండ్రోయ్​ అంటూ చేసే గోల ఎప్పటికీ ఎవర్​గ్రీన్ కామెడీ సీన్​. ఇప్పుడు ఆ సీన్ ఎందుకు అంటారా? అయితే అలాంటి ఫన్నీ సీనే నిజజీవితంలోనూ చాలా మందికి జరిగి ఉంటుంది. సరిగ్గా అలాంటి వీడియోనే ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ చిన్న కుర్రాడికి సరిగ్గా అలాంటి అనుభవమే ఎదురైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసలు ఏమైందంటే..


జాయింట్ వీల్ బయటి నుంచి చూస్తే అది ఎక్కాలని ఎంజాయ్ చేయాలని చాలా మంది అనుకుంటారు. ఇక పిల్లల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలానే ఓ 10-12 ఏళ్ల వయసున్న బుడ్డొడు జాయింట్​ వీల్ ఎక్కాడు. అది ఎక్కినప్పుడు అ బుడ్డోడి సంతోషానికి అవదుల్లేవు. అది చిన్నగా కదలటం ప్రారంభించినప్పుడు ఆ పిల్లాడు చప్పట్లు కొట్టి మరీ ఎంజాయ్ చేశాడు. అయితే ఆ సంతోషం ఎంతోసేపు ఉండలేదు.


కొద్దికొద్దిగా ఆ జాయింట్​ వీల్ వేగం పెరిగేసరికి ఆ కుర్రాడు భయంతో అరవడం మొదలు పెట్టాడు. దేవుళ్ల పేర్లు తలచుకుంటూ కాపాడండీ అంటూ అరవడం మనం వీడియోలో చూడొచ్చు. ఇంట్లో వాళ్లను పిలుస్తూ అరవడం స్టార్ట్​ చేశాడు. అయితే ఆ జాయింట్​ వీల్ సురక్షితమైనప్పటికీ.. ఆ బుడ్డోడి భయం ఆ బుడ్డోడిది.



అయితే ఆ భయంతో చేసిన పనులను.. అదే జాయింట్ వీల్​లో ఉన్న ఓ వ్యక్తి రికార్డ్​ చేశాడు. ఆ వీడియోలోని దృశ్యాలు మాత్రం నెటిజన్లను తెగ నవ్విస్తున్నాయి. giedde అనె ఇన్​స్టాగ్రామ్​లో ఈ వీడియోను షేర్ చేసింది అయితే ఆ వీడియో జరిగిన ప్రాంతం ఎక్కడ అని మాత్రం అందులో చెప్పలేదు.


Also read: Viral Video: పెళ్లి ఊరేగింపులో 'శ్రీవల్లి' ఫీవర్.. హుక్ స్టెప్‌తో ఊగిపోయిన యువకులు! రచ్చ మాములుగా లేదుగా!!


Also read: Viral News: వీడెవడండి బాబు.. ఒకేసారి ముగ్గురు కవలలను పెళ్లాడిన యువకుడు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook