Thunder Lightning: మీరు ఎప్పుడైనా లైవ్‌లో పిడుగులు పడడం చూశారా? చెట్లపై పిడుగులు పడితే ఏం జరుగుతుందో తెలుసా..
Thunder Lightning Viral Video: వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఆకాశం నుంచి మెరుపులు వచ్చి చెట్లపై మనుషులపై పిడుగులు పడడం మనం చూడవచ్చు. ఇలాంటి సంఘటననే ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
Thunder Lightning Viral Video: వర్షం కురవడం వల్ల లాభాలు నష్టాలు రెండు ఉన్నాయి. భారీ వర్షాల కారణంగా ప్రజలు, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. చాలా చోట్ల వర్షాలు అధికంగా కురిసి ఎంతో ఆస్తి నష్టం జరుగుతోంది. అంతేకాకుండా కొన్నిచోట్ల పిడుగుల కారణంగా మనుషులతో పాటు జంతువులు కూడా మరణిస్తున్నాయి. పిడుగులు ఎంత శక్తివంతమైనవో అందరికీ తెలిసిందే. ఆకాశం నుంచి వచ్చే మెరుపుల ద్వారా అది పడే ప్రతి చోట అగ్ని జ్వలలను పుట్టిస్తుంది. చాలా మంది పిడుగులను లైవ్‌లో చూసిన వారు ఉంటారు. ఇంతకుముందు ఎప్పుడు చూడని వారికోసం మేము ఈ రోజు పిడుగు అంటే ఏమిటో చూపించబోతున్నాం.
భారీ వర్షాల కారణంగా కొన్ని కొన్నిచోట్ల పిడుగులు పడుతూ ఉంటాయి. ఇటీవల ఓ వ్యక్తి పిడుగు అంటే ఏమిటి అనేవారికి ఓ వ్యక్తి ఫోన్లో వీడియోను రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇంతవరకు ఇలాంటి సన్నివేశాలను ఎప్పుడూ చూడలేమని చాలామంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వీడియో వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి తన ఇంటి పైనుంచి వర్షం పడుతుండగా సరదాగా కొన్ని వీడియోలను రికార్డు చేస్తున్నాడు అదే సమయంలో ఒకచోట ఆకాశం భారీ శబ్దంతో నుంచి మెరుపు చెట్టుపై పడి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఇలా భారీ శబ్దం రావడంతో అక్కడే ఉన్న ప్రజలు భయంతో అరుపులతో పాటు కేకలు వేశారు. ఉరుములు ఎంత ప్రమాదకరమైన వంటే.. ఒక చెట్టు కింద వ్యక్తి నిలబడినప్పుడు ఆ చెట్టుపై పిడుగు వేస్తే, చెట్టు కింద ఉన్న వ్యక్తి మరణించడం ఖాయం. ఇలా చాలా సంఘటనలు ఇంతవరకు జరిగాయి. మీరు ఈ వీడియో గమనిస్తే.. పిడిగేసిన చెట్టుపై మంటలు రావడం మీరు క్లియర్ గా చూడవచ్చు. అంతేకాకుండా ఆ చెట్టు దగ్గర ఉండే స్థానికులకు ప్రమాదం జరిగి ఉండవచ్చని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Also Read: Guntur Karam Movie: 'గుంటూరు కారం' నుంచి పూజా హెగ్డే ఔట్.. మరో స్టార్ హీరోయిన్ ఎంట్రీ..?
ఈ 12 సెకండ్ల వీడియోను ఎక్స్క్లూషన్ వీడియోస్ అనే ట్విట్టర్ ఖాతా నుంచి షేర్ చేశారు. ఈ షార్ట్ వీడియోను ఇప్పటివరకు లక్ష మందికి పైగా వీక్షించారు. అంతేకాకుండా మరికొందరు నెటిజన్లు ఇలాంటి వీడియోలను ఇంతవరకు ఎప్పుడూ చూడలేము అంటూ.. కామెంట్లు కూడా చేస్తున్నారు. వర్షం భారీగా కురిసినప్పుడు సురక్షిత ప్రాంతాల్లో ఉండడమే మేలు. లేకపోతే పిడుగుల కారణంగా ప్రాణాలు కోల్పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా వర్షాకాలంలో అన్ని రకాల జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది.
Also Read: Guntur Karam Movie: 'గుంటూరు కారం' నుంచి పూజా హెగ్డే ఔట్.. మరో స్టార్ హీరోయిన్ ఎంట్రీ..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook