Viral Video: వీళ్లు మనుషులేనా అసలు..?.. శునకం పై పెట్ క్లినిక్ లో పిడిగుద్దులు.. వైరల్ గా మారిన వీడియో..
Maharashtra: శునకం పట్ల పెట్ క్లినిక్ లో ఇద్దరు యువకులు క్రూరంగా ప్రవర్తించారు. ఇష్టమున్నట్లు పిడిగుద్దులు కొడుతూ, పైశాచికంగా ప్రవర్తించారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో తీవ్రదుమారం చెలరేగింది. థానేలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
2 Men Punch And Kicks Pet Dog: మనలో చాలా మంది శునకాలను ఎంతో ఇష్టంతో పెంచుకుంటారు. కొందరైతే మనుషులకన్నాకుక్కలే ఎంతో విశ్వాసంతో ఉంటాయని భావిస్తారు. అందుకే శునకాలను కూడా ఇంట్లో వాళ్లలాగానే చూసుకుంటారు. మంచి ఫుడ్ పెడతారు. వాకింగ్ కు తీసుకెళ్తారు. వెటర్నరీకి కూడా తీసుకెళ్తారు. శునకాలు కూడా తమ యజమానుల పట్ల అంతే విశ్వాసంతో ఉంటాయి. తమ యజమాని కన్పించకపోతే అన్నంకూడా ముట్టుకోవు.
కొత్త వాళ్లు ఇంట్లో వస్తే .. అరిచి ఇంట్లొ వాళ్లని అలర్ట్ చేస్తాయి. కంటికి రెప్పలా తమ ఇంటిని కాచుకోని చూస్తుంటాయి. అయితే.. నోరు లేని పట్ల కొందరు అమానుషంగా ప్రవర్తించే వారు కూడా లేకపోలేదు. రోడ్డుమీద ఆవులు, శునకాలు, పెంపుడు జంతువుల మీద కూడా దాడులు చేస్తుంటారు. అచ్చం ఇలాంటి ఘటన ఒకటి ముంబైలో జరిగింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు..
మహారాష్ట్రలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. థానే జిల్లాలో పెట్ క్లినిక్ లో జరిగిన ఘటన తీవ్ర దుమారంగా మారింది. ఒక వ్యక్తి తన పెట్ డాగ్ ను ట్రీట్మెంట్ కోసం వెటర్నరీ క్లినిక్ కు తీసుకెళ్లాడు. అక్కడ మయూర్ మైఖేల్, ప్రశాంత్ గైక్వాడ్‌లు క్లినిక్ లో శునకం పట్ల పైశాచికంగా ప్రవర్తించారు. కుక్కను పంచ్ లు కొడుతూ, ముఖంపై కొడుతూ, కాళ్లతో తన్నుతూ దారుణంగా ప్రవర్తించారు. పాపం .. శునకం బాధతో విలవిల్లాడిన కూడా అస్సలు పట్టించుకోలేదు. ఈ ఘటనను వీడియో తీసి పైశాచికంగా కూడా ప్రవర్తించారు.
ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై జంతు ప్రేమికులు సంఘాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. నిందితులపై చర్యలు తీసుకొవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. జంతు హక్కుల సంస్థ PAWS యొక్క ఆఫీస్ బేరర్ నీలేష్ భాంగే, మరికొంత మంది కాసర్వాడవల్లి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించిన తర్వాత పెట్ షాప్‌లోని ఇద్దరు సిబ్బందిపై నాన్-కాగ్నిసబుల్ ఫిర్యాదు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Read More: Disha Patani hot Pics: లో దుస్తుల్లో రెచ్చిపోయిన దిశా.. ఇక చాలు బాబోయే అంటున్న కుర్రకారు..
'స్ట్రీట్ డాగ్స్ ఆఫ్ బాంబే' అనే మరో జంతు సంక్షేమ NGOకూడా దీనిపై సీరియస్ స్పందించింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకొవాలని పోలీసులను కోరారు. ఈ ఘటనపై అనేక మంది నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. ఇలా కొట్టడానికి వీరికి మనస్సలే వచ్చింది.. వీళ్లు మనుషులేనా..?.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. వీరిని కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook