young man Letter to MLA to become girlfriend: ప్రజలకు ఏవైనా సమస్యలుంటే ఎమ్మెల్యే(MLA) దగ్గరికి వెళ్లి పరిష్కరించుకుంటారు. అలా జనాల నుంచి వచ్చిన ఆర్జీలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యేకు ఓ వింత అభ్యర్థన వచ్చిందట. నేను మంచోడిని.. నన్నెవరు పట్టించుకోవడం లేదు.. మీ నియోజకవర్గ అమ్మాయిల(Girls)ను ప్రేమించేలా ప్రోత్సహించండి అంటూ ఓ యువకుడు ఎమ్మెల్యేకు లేఖ రాశాడు. అయితే ఈ లెటర్ ఒక్కసారిగా సోషల్ మీడియా(Social Media)లో వైరల్ (Viral)గా మారింది. అయితే ఆ లేఖ ఎవరూ రాశారో కనుక్కుంటే విస్తుగొల్పే నిజం తెలిసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసలేం జరిగిందంటే.
మహారాష్ట్ర(maharastra)లోని చంద్రాపూర్‌ జిల్లా(Chandrapur District)లోని రాజూరా ఎమ్మెల్యే సుభాశ్‌ ధొతే(MLA Subhash Dhote)కు ఇటీవల ఓ లేఖ వచ్చింది. మరాఠీలో రాసిన ఆ లేఖ భూషణ్‌ జాంబవంత్‌ రాఠోడ్‌ పేరిట వచ్చింది. ఆ లేఖ(Letter) తెరచి చూడగా.. ‘మన ప్రాంతంలో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. ఏ అమ్మాయి కూడా నాతో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. గద్‌చందూర్‌ నుంచి రాజురా మధ్య నిత్యం ప్రయాణిస్తుంటా. భవిష్యత్‌లో నాకు ప్రేయసి దొరుకుతుందనే నమ్మకం నాకు లేదు. తాగుబోతులకు తప్ప ఎలాంటి చెడు అలవాట్లు లేని నాలాంటివారికి ప్రేయసి దొరకడం లేదు. దయచేసి మీ నియోజకవర్గంలో ఉన్న అమ్మాయిలను ప్రోత్సహించండి’ అంటూ ఆ లేఖలో ఎమ్మెల్యేకు సూచిస్తూ పంపాడు. ఆ లేఖను చూసిన ఎమ్మెల్యే వెంటనే ఆరా తీశారు.


Also Read: Costly Fish: ప్రపంచంలో అత్యంత విలువైన చేప ఇదే, ఈ చేపకు సెక్యూరిటీ గార్డులు కూడా


భూషణ్‌ జాంబవంత్‌ రాఠోడ్‌(Bhushan Jamuwant) పేరుగల వారిని ఆరా తీయగా అలాంటి పేరుతో ఉన్నవారెవరూ లేరు. వైరల్‌గా మారడానికి ఇలా లేఖ రాశారని తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ లేఖపై సోషల్‌ మీడియా ఫన్నీగా స్పందిస్తోంది. నీదే కాదు బ్రదర్‌ నా పరిస్థితి అంతే అంటూ సింగిల్‌ కింగ్‌లు పేర్కొంటున్నారు. ఫన్నీ మీమ్స్‌, కామెంట్లు వస్తున్నాయి. ఇలాంటి లేఖ రావడం ఇదే మొదటిసారిని ఎమ్మెల్యే పేర్కొన్నాడు. ఆ అబ్బాయి ఎవరో తెలిస్తే అతడికి కౌన్సిలింగ్‌ ఇస్తామని ఎమ్మెల్యే సుభాష్‌ చెప్పాడు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook