Mahi V Raghava : దుమ్ములేపేస్తోన్న డైరెక్టర్.. అప్పుడు భయపెట్టి ఇప్పుడు నవ్వించేసిన మహి వీ రాఘవ.. పిక్చర్ అబీ బాకీ హై
Mahi V Raghava new Projects ఆనందో బ్రహ్మ, యాత్ర రెండు సినిమాలు డిపరెంట్ జానర్స్. ఈ రెండు సినిమాలను తీసి జనాలను మెప్పించాడు మహీ వి రాఘవ. అలాంటి దర్శకుడి నుంచి సేవ్ ది టైగర్స్ అనే హాస్యభరితమైన వెబ్ సిరీస్ వస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు.
Mahi V Raghava new Projects మహీ వి రాఘవ అంటే ఓ బ్రాండ్ ఉంటుంది. ఆనందో బ్రహ్మ సినిమాతో ఇలా నవ్వించేశాడేంటి, భయపెట్టాడేంటి? అని అంతా అనుకున్నారు. ఆ సినిమా ఫార్మాటే తెలుగు వారికి కొత్తగా ఉంటుంది. అయితే ఆ తరువాత యాత్ర అంటూ అందరినీ ఎమోషనల్‌గా కదిలించాడు. ఆ సినిమాలో మమ్ముట్టిని చూపించిన తీరు, ఆ సినిమాను నడిపించిన తీరుకు అంతా ఫిదా అయ్యారు. ఇక యాత్రకు సీక్వెల్ కూడా ఉంటుందని ముందు నుంచి మహీ వి రాఘవ చెబుతూనే వచ్చాడు.
కరోనా టైంలో దొరికిన గ్యాప్‌తో ఈ దర్శకుడు.. తన కథల్లోని ఒక్కో దానికి పదును పెడుతూ వచ్చాడు. అందులోంచి వచ్చిందే ఈ సేవ్ ది టైగర్స్. మహి కథ, కథనాన్ని అందించిన ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు తెలుగులో ట్రెండ్ అవుతోంది. ఈ మధ్య కాలంలో ఇంతగా నవ్వించిన వెబ్ సిరీస్ గానీ, సినిమా గానీ ఇంకోటి లేదని జనాలు కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రియదర్శి, అభినవ్, రోహిణి, చైతన్యల పర్ఫామెన్స్‌ల గురించి బాగానే మాట్లాడుకుంటున్నారు.
సేవ్ ది టైగర్స్ అనే వెబ్ సిరీస్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో మహి వీ రాఘవ నెక్ట్స్ ప్రాజెక్టుల మీద ఇప్పుడు ఫోకస్ పడింది. అయితే నెక్ట్స్ ఎవ్వరూ ఊహించని కంటెంట్‌తో రాబోతోన్నట్టుగా తెలుస్తోంది. ఇంత వరకు నవ్వించాడు, భయపెట్టాడు. ఇక తదుపరి ప్రాజెక్టుల్లో అంతకు మించి అనేలా ఉంటుందట. ఇక మహి వీ రాఘవ ఇప్పుడు సినిమాలు, ఓటీటీ ప్రాజెక్టులు అంటూ రెండు వైపులా పనులు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.
Also Read: Manobala Death : ఇండస్ట్రీలో విషాదం.. నటుడు మనోబాల మృతి
ఓటీటీలో ఎక్కువగా కామెడీ, బోల్డ్ కంటెంట్‌లకు గిరాకీ ఉంటుంది. ఇక మహీ వి రాఘవ సైతం నెక్ట్స్ టైం బోల్డ్ కంటెంట్‌తో ప్రేక్షకులను మెప్పించేందుకు రాబోతోన్నట్టుగా తెలుస్తోంది. ఇంకా కొన్ని ప్రాజెక్టులను కూడా ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
Also Read: Aadi Sai Kumar Wife : ఇలా కూడా ఉంటారా?.. ఆది సాయి కుమార్ భార్య కోరిక, కల ఇదేనట
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook