Anand Mahindra: ఆ టైగర్ వీడియోపై ఆనంద్ మహీంద్రా ఫన్నీ కామెంట్స్.. వాటే సెన్సాఫ్ హ్యూమర్...
Anand Mahindra Funny twitter post: ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఫన్నీ ట్విట్టర్ పోస్టు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఓ టైగర్ వీడియోను పోస్ట్ చేసిన ఆనంద్ మహీంద్రా... దానిపై ఫన్నీ కామెంట్స్ చేశారు.
Anand Mahindra Funny twitter post: ప్రముఖ వ్యాపారవేత్త, ఆటోమొబైల్ దిగ్గజ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra and Mahindra) ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. సమకాలీన అంశాలపై స్పందించడంతో పాటు సరదా, ఆలోచనాత్మక పోస్టులతో ఆకట్టుకుంటుంటారు. తాజాగా మరో ఫన్నీ పోస్టుతో తన హాస్య చతురతను చాటుకున్నారు.
ఆ పోస్టులో ఓ టైగర్ వీడియోను గమనించవచ్చు. అందులో ఆ టైగర్.. కారు వెనుక భాగాన్ని తన పళ్లతో గట్టిగా కొరికి పట్టింది. దాన్ని ఊడబీకేందుకు గట్టి ప్రయత్నమే చేసింది. ఈ క్రమంలో కారు వెనక్కి కదిలింది తప్పితే ఆ పార్ట్ మాత్రం ఊడి రాలేదు. బహుశా ఆ టైగర్‌కి మహీంద్రా కారు రుచికరంగా అనిపించి ఉండొచ్చు... అంటూ ఆనంద్ మహీంద్రా ఫన్నీ కామెంట్ చేశారు.
'దావానలంలా అలా చుట్టి వస్తుంటే... ఊటీ నుంచి మైసూర్ వెళ్లే రోడ్డులో తెప్పెకాడు సమీపంలో ఈ సీన్ కనిపించింది. ఆ కారు Xylo. ఆ టైగర్.. కారును అలా నమలడం నాకేమీ ఆశ్చర్యంగా అనిపించలేదు. మహీంద్రా కార్లు రుచికరంగా ఉంటాయనే నా ఆలోచనే దానికి కూడా తోచి ఉండవచ్చు.' అని ఆనంద్ మహీంద్రా తన పోస్టులో పేర్కొన్నారు. ఆనంద్ మహీంద్రా పోస్టుపై (Viral Video) నెటిజన్లు కూడా అంతే ఫన్నీగా స్పందిస్తున్నారు. 'ఆ టైగర్ పళ్లు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నట్లున్నాయి... ఇంతకీ అది కోల్గెట్ వాడుతుందా లేక పెప్సోడెంటా...' అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరో నెటిజన్.. 'అయితే ఇంకేం... మహీంద్రా కంపెనీ ఫుడ్ చెయిన్ కూడా చేసేయొచ్చు...' అని కామెంట్ చేశాడు. ఇప్పటివరకూ ఆ పోస్టుకు 2350 లైక్స్ రాగా... 231 మంది రీట్వీట్ చేశారు.
Also Read: RRR First Review: ఆర్ఆర్ఆర్ ఫస్ట్ రివ్యూ... ఎన్టీఆర్, రాంచరణ్ ఫ్యాన్స్ మధ్యన చిచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook