Catching King Kobra : సోషల్ మీడియాలో ప్రస్తుతం వింతగా ఉన్న వీడియోలు, అడ్వంచరెస్ వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొంత మంది రకరకాల వీడియోలను చేస్తుంటారు. తమ తమ యూట్యూబ్ చానెళ్లలో పెట్టుకుంటారు. అందులో రకరకాల వీడియోలను షేర్ చేస్తుంటారు. ఒకతను ఇలానే పాముల్ని పట్టే వీడియోలను షేర్ చేశాడు. అందులో రెండు కింగ్ కోబ్రాలను అడవిలో పట్టుకుని వదిలేశాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీటిని ఎలా పట్టుకున్నాడో.. ఎలా ఆడించాడు.. ఎలా విడిచిపెట్టాడో చూస్తే ఒళ్లు జలదరించిపోతుంది. అసలే కింగ్ కోబ్రాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. కొండ చిలువలు, కొంగ్ కోబ్రాలు అంటే అందరూ భయపడుతుంటారు. ఇక బుసలు కొడుతున్న ఈ కింగ్ కోబ్రాను అతను ఎంతో చాకచక్యంగా పట్టేసుకున్నాడు. 


 



తోకను పట్టుకుని తల వరకు కంట్రోల్ చేశాడు. అయితే ఈ కింగ్ కోబ్రాలు సాధారణంగా త్వరగా కాటు వేయవని చెప్పుకొచ్చాడు. అవి కాస్త ఆలోచిస్తాయ్ అని అన్నాడు. అలా తాను కింగ్ కోబ్రాలను మళ్లీ అడవిలో వదిలేస్తున్నాను అని చెప్పేశాడు. ఇక అలా ఆ కింగ్ కోబ్రా మళ్లీ అడవిలోకి వెళ్లిపోయింది.


అయితే ఇలా ఆ వీడియోను చూసిన నెటిజన్లు మాత్రం ఆశ్చర్యపోతోన్నారు. జాగ్రత్తగా ఉండాలని, కింగ్ కోబ్రాలను ప్రమాదకరమని సలహాలు ఇస్తున్నారు. వీడియో బాగుందని ఇంకొందరు యూట్యూబ్ కింద కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి కింగ్ కోబ్రాలను మాత్రం ఆ వ్యక్తి ఎంతో చాకచక్యంగా పట్టుకుని మళ్లీ అడవిలోకి వదిలేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.


Also Read : Anasuya Bharadwaj : ఫ్లైట్‌లో డ్రెస్ చిరిగిందట.. విమానాయాన సంస్థపై అనసూయ ఫైర్


Also Read : Nirupam Paritala - Premi Viswanath : కార్తీకదీపం సెట్లో వంటలక్క చేసే పనులివేనా?.. డెడికేషన్ అంటే డాక్టర్ బాబుదే


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook