సాధారణంగా ఎవరైనా కొండముచ్చులను చూస్తే భయంతో అక్కడి నుంచి పరుగులు పెడతారు. కానీ ఇదిగో ఇక్కడ ఈ ఫోటోలో కనిపిస్తున్న స్వప్నిల్ సోని అనే వ్యక్తి మాత్రం ప్రతీ సోమవారం ఆ కొండముచ్చులతోనే కాసేపు సరదాగా గడిపి, వాటికి కడుపు నిండా రొట్టెలు పంచి పెట్టి వెళ్తాడు. అది కూడా ఏ వందో లేక రెండొందల రొట్టేలో కావు.. ఏకంగా 1700 రొట్టెలు ఈ కొండముచ్చులకు ఆహారంగా పంచిపెట్టడం స్వప్నిల్‌కి అలవాటు. అలా అతడు గత పదేళ్లుగా వాటికి రొట్టెలు ఆహారంగా పంచిపెడుతున్నాడట. ఆరు నెలల క్రితం తాను ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నప్పుడు కూడా తాను రొట్టెలు ఆహారంగా ఇవ్వడం ఆపలేదని గుర్తుచేసుకుంటూ.. తాను ప్రస్తుతానికి మళ్లీ ఆర్థికంగా నిలదొక్కుకున్నానని, ఇక ఈ పని ఆపే ప్రసక్తే లేదని తేల్చిచెబుతున్నాడు. అంతేకాదు.. తన తర్వాత తన కొడుకు కూడా ఈ పనిని కొనసాగిస్తాడని చెబుతున్నాడు. 


నోరు లేని మూగజీవాల నుంచి ఏమీ ఆశించకుండానే వాటి ఆకలి బాధ తీర్చుతున్న స్వప్నిల్ సోని నిజంగానే చాలా గొప్పోడు కదా!!