Cars Parking on Building To Avoid No Parking Challans : గ్లోబల్ వార్మింగ్ తరువాత ప్రపంచాన్ని పట్టిపీడిస్తోన్న ఇంకొన్ని సమస్యల్లో వాహనాల పార్కింగ్ ఒకటి. ప్రపంచం నలుమూలలా ఏ దేశానికి వెళ్లినా.. పెద్ద పెద్ద నగరాలు, పట్టణాలను పట్టిపీడిస్తున్న సమస్యే ఈ వాహనాల పార్కింగ్ సమస్య. నగరాలు, పట్టణాల్లో వాహనాల సంఖ్య భారీగా పెరిగిపోతుండటం, ఆ వాహనాలను పార్కింగ్ చేసుకునేంత స్థలం సౌకర్యం అందరికీ తమ తమ ఇళ్లలో లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం అవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాహనాల రద్దీ అధికంగా ఉండే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, ఆస్పత్రులు, మల్టీప్లెక్స్ సినిమా థియేటర్స్ లాంటి పబ్లిక్ ప్లేసెస్ విషయానికొస్తే, కేవలం వెహికిల్ పార్కింగ్ సమస్యను అరికట్టడం కోసమే బిల్డింగ్స్ కింది భాగంలో రెండు నుంచి నాలుగైదు అంతస్తుల వరకు సెల్లార్ నిర్మించి అందులో వాహనాల పార్కింగ్ చేసుకోవడానికి అనుమతిస్తున్నారు. 


కానీ ఈ సౌకర్యం ప్రజలు నివాసం ఉండే ఆపార్ట్‌మెంట్స్, చిన్న చిన్న ఇళ్లకు అన్ని సందర్భాల్లో కుదరదు. అలాంటప్పుడు జనం తమ తమ వాహనాలను తమ ఇంటి ముందు రోడ్డు పక్కనే పార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ రోడ్డుపై పార్కింగ్ చేస్తే ప్రభుత్వం దృష్టిలో అది నేరం అవుతుంది. నో పార్కింగ్ ప్లేస్‌లో వాహనాన్ని నిలిపినందుకు ట్రాఫిక్ పోలీసులు సదరు వాహనాల యజమానులకు ట్రాఫిక్ చలాన్లు పంపించడం జరుగుతుంది. ఇదే అసలు సమస్య. ఏదో ఒక్క రోజు, రెండు రోజుల సమస్య కాదు ఇది. వాహనాలు రోడ్డు పక్కన నో పార్కింగ్ ప్లేస్‌లో నిలిపినంత కాలం ఈ చలాన్ల మోత తప్పదు. మరి నిత్యం చలాన్లు పడితే.. ఆ చలాన్లు కడుతూ పోతే ఆ వాహనదారుల పరిస్థితి ఏంటి ? ఊహించుకోవడానికే కష్టం కదా.. 


సరిగ్గా ఈ ఫోటోలో మనం చూస్తున్న ఈ బిల్డింగ్‌లో ఉండే వ్యక్తికి కూడా అదే సమస్య ఎదురైంది. ఇంటి ముందు రోడ్డుపై కార్లు పార్కింగ్ చేస్తున్నావంటూ ట్రాఫిక్ పోలీసులు నిత్యం చలాన్లు పంపిస్తుండటంతో ఆ చలాన్లు చెల్లించలేక విసిగిపోయిన ఆ వ్యక్తి చివరకు ఏం చేయాలో అర్థంకాక తన వద్ద ఉన్న రెండు కార్లను ఇలా బిల్డింగ్ ఎక్కించేశాడు. వినడానికి విడ్డూరంగా.. చూడ్డానికి ఆశ్చర్యంగా ఉంది కదూ.. కానీ ఇదే నిజం. నమ్మలేకపోతే ఈ బిల్డింగ్‌పై కార్లు పార్కింగ్ చేసి ఉండటాన్ని మీరే స్వయంగా చూడండి.


ఇది కూడా చదవండి : viral news: ఈ బుడ్డోడి టైమ్ టేబుల్ చూస్తే.. మీ బాల్యం గుర్తుకు రావడం పక్కా


ఇప్పుడు మీకో అనుమానం వచ్చి ఉండొచ్చు.. రోడ్డు లేకుండా ఆ వ్యక్తి ఈ కార్లను ఇంటి డాబా పైకి ఎలా ఎక్కించి ఉండవచ్చని కదా.. మరేం లేదు.. రోడ్డుపై పార్కింగ్ చేసి ట్రాఫిక్ చలాన్లు కట్టడం కంటే ఒకేసారి క్రేన్ పెట్టి ఎయిర్ లిఫ్ట్ చేసి ఇంటి డాబాపై పార్కింగ్ చేయడం ఉత్తమం అనుకున్నాడట ఆ వ్యక్తి. ఆ ఆలోచన వచ్చిందే తడవు ఆలస్యం చేయకుండా వెంటనే ఓ క్రేన్ సహాయంతో రెండు కార్లను ఇంటిపైకి ఎక్కించేశాడు. అలాగే పర్మినెంటుగా అక్కడ ఉంచలేడు కనుక ఆ తరువాత రెండు కార్లను కిందికి దించి తన వద్ద లేకుండా అమ్మేశాడట. తైవాన్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రాఫిక్ పోలీసుల ఛలాన్లు అతడికి ఎంత ఫ్రస్టేషన్ తెప్పించి ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. 


ఇది కూడా చదవండి : Batsman Collides With Football Goal Post: క్రికెట్లో పరుగు తీస్తూ ఫుట్ బాల్ గోల్ పోస్టుని ఢీకొట్టాడు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK