Snakes Viral Video: బాబోయ్.. అంత పెద్ద పామును ఒంటి చేత్తో.. వీడు మామూలోడు కాదు..

Snakes Viral Videos: పాము అంటేనే కొంత మందికి విపరీతమైన భయం.. వాళ్లు పాము అనే పేరు వింటేనే ఆమడదూరం పరిగెత్తుతారు. అంతేకాదు.. కొన్నాళ్లపాటు ఆ పాము కనిపించిన దరిదాపుల్లోకి వెళ్లే సాహసం కూడా చేయరు. కానీ కొంతమంది మాత్రం అలా కాదు.. ఇదిగో ఇలా ఉంటారు.
Snakes Viral Videos: పాము అంటేనే కొంత మందికి విపరీతమైన భయం.. వాళ్లు పాము అనే పేరు వింటేనే ఆమడదూరం పరిగెత్తుతారు. అంతేకాదు.. కొన్నాళ్లపాటు ఆ పాము కనిపించిన దరిదాపుల్లోకి వెళ్లే సాహసం కూడా చేయరు. అయితే అందరూ ఒకలా ఉండరు కదా.. ఇదిగో ఈ వీడియో మాదిరిగా దైర్యంగా వ్యవహరిస్తారు. ఏమాత్రం జంకకుండా వాటిని తేలిగ్గా హ్యాండిల్ చేస్తారు. అలాగని వాళ్లు పాములకు ఏదైనా హాని తలపెడతారని అనుకోవద్దు. ఎందుకంటే పాములకు ఎలాంటి హాని కలగకుండా సేఫ్‌గా డీల్ చేయడంలో అలాంటి వాళ్లే ఎక్స్‌పర్ట్‌లుగా ఉంటారు మరి. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ వీడియో చూస్తే మీకు కూడా ఎగ్జాట్లీ అలాగే అనిపిస్తుంది.
రాత్రి పూట అడవి లోంటి ట్రావెల్ చేస్తున్న వారికి నడి రోడ్డుపై ఆగిన ఓ పెద్ద పాము కనిపించింది. ఎవరైనా పాము చూడగానే అది ఏం పాము, ఆ సమయంలో దాని పరిస్థితి ఎలా ఉంది ? దగ్గరికి వెళ్తే ఆ పాము ఎలా రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అన్నీ బేరీజు వేసుకున్న తర్వాతే ఆ పామును సమీపిస్తారు. కానీ ఈ వీడియోలో ఉన్న వ్యక్తి మాత్రం అంత చీకట్లోనూ కేవలం వాహనాల వెలుతురులో కనిపిస్తున్న పాము దగ్గరికి వెళ్లాడు. అది ఏం పాము, ఏంటని ఆలోచించకుండానే ఏదో సాదు జంతువును హ్యాండిల్ చేసినట్టుగానే దాని తోక పట్టుకుని లాగి రోడ్డు పక్కకు పడేశాడు. అతడు తోక పట్టుకున్న సమయంలో దాదాపు కరిచినంత వేగంగా ప్రతిఘటించింది ఆ పాము. కానీ అతడు మాత్రం ఏమాత్రం జంకకుండా సింపుల్‌గా దూరం జరిగాడు. ఆ తర్వాత పాము కూడా అతడిని ఏమీ అనకుండానే రోడ్డు పక్కనున్న పొదల్లోకి వెళ్లిపోయింది.
అతడిని పాము దగ్గరికి వెళ్లొద్దంటూ ప్రత్యక్షసాక్షులు వారిస్తున్నప్పటికీ.. ఆ పామును అలాగే వదిలేస్తే వాహనాల కింద పడి నలిగిపోతుందనే భయంతో ఆ పామును రక్షించేందుకు అతడు చూపిన చొరవ చూసి ప్రత్యక్షసాక్షులే కాదు.. నెటిజెన్స్ కూడా ఔరా అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయం చెప్పండి అంటూ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ పర్వీన్ కస్వాన్ ట్విటర్ ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. నెటిజెన్స్ నుంచి ఈ వీడియోకు భారీ స్పందన కనిపిస్తోంది. పామును చీకట్లో వాహనాల కిందపడి నలిగిపోకుండా కాపాడిన అతడి తెగువను అభినందించిన వాళ్లే ఎక్కువున్నారు.
Also Read : Monkey Playing With Tiger: పులిని తెలివిగా ఫూల్ చేసి కిందపడేసిన కోతి.. వీడియో వైరల్
Also Read : Banana Snake: ఇది అరటి పండు కాదు..భయంకరమైన పాము
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి