Social Media Trending Video మనం సినిమాలో కొన్ని సీన్స్ చూస్తుంటాం. ఆటోలో, కారులోంచి మనుషులు దిగుతూనే ఉంటారు. మరీ ముఖ్యంగా అతడు సినిమాలో వ్యాన్‌లోంచి దిగుతూనే ఉంటారు. అలా ఇప్పుడు ఓ వీడియోను వైరల్ అవుతోంది. సైకిల్ మీద ఓ వ్యక్తి తన తొమ్మిది మంది పిల్లలను ఎక్కించుకుని పోతోన్నాడు. వెనకాల ముగ్గురు, ముందు ముగ్గురు తన మీద ఇలా ఎక్కడ పడితే అక్కడ పిల్లలను ఎక్కించుకుని తాపీగా వెళ్తున్నాడు. అయితే ఈ వీడియో చూసిన జనాలు రకరకాలుగా స్పందిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ఇలాంటి అవగాహన లేని వారి వల్లే జనాభా ఇలా పెరుగుతోందని కౌంటర్లు వేశారు. గ్యాప్ ఇవ్వరా కాస్త గ్యాప్ ఇవ్వమని ఇంకొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇంకా కంటావా? క్రికెట్ టీంను తయారా చేస్తావా? ఇప్పటికే జనాభా ఎనిమిది వందల కోట్లు దాటేసిందని కౌంటర్లు వేస్తున్నారు.


మొత్తానికి ఈ వీడియో మాత్రం ఇప్పుడు జనాలను ఆకట్టుకుంటోంది. అయితే కొందరు మాత్రం అతనికే మద్దతు ఇస్తున్నారు. అతను పేదవాడు అనే కదా? మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు.. తిరిగి ఏమీ అనలేడని, ఏమీ చేయలేరనే కదా? ఇలా ట్రోల్స్ చేస్తున్నారంటూ ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు.


వాళ్లంతా కూడా అతని పిల్లలే అని చెప్పడానికి గల గ్యారెంటీ ఏంటి? వేరే పిల్లల్ని కూడా అలా ఎక్కించుకుని వస్తున్నాడేమో కదా? అంటూ జనాలు లాజిక్స్ తీస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Also Read : Sudigali Sudheer : జబర్దస్త్ షోను అందుకే వదిలేశా.. ఆఫీస్ బాయ్‌గా అయినా చేస్తా.. సుడిగాలి సుధీర్


Also Read : Neha Shetty Latest Pics : రాధిక.. పెట్టించావ్ కెవ్వు కేక.. డీజే టిల్లు హీరోయిన్ ఎద అందాల ప్రదర్శన


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook