Man Stomach With Coins : కడుపులో కాయిన్స్.. బ్యాంకులో దాచుకున్నట్టుగా దాచుకున్నాడా?.. అవాక్కైన డాక్టర్
![Man Stomach With Coins : కడుపులో కాయిన్స్.. బ్యాంకులో దాచుకున్నట్టుగా దాచుకున్నాడా?.. అవాక్కైన డాక్టర్ Man Stomach With Coins : కడుపులో కాయిన్స్.. బ్యాంకులో దాచుకున్నట్టుగా దాచుకున్నాడా?.. అవాక్కైన డాక్టర్](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/styles/zm_500x286/public/2022/11/29/254293-stomuchcoins.jpg?itok=Yxw_hLkl)
Man Stomach With One Coin కడుపులో కాయిన్స్ కనిపించడంతో డాక్టర్ షాక్ అయ్యాడు. కర్ణాటకలో బయటకు వచ్చిన ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Man Stomach With Coins ఓ వ్యక్తి మానసిక వేదనతో కుంగిపోయాడు. అంతటితో ఆగకుండా ఆ వ్యక్తి చిల్లర నాణెలను మింగుతూ వచ్చాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియకుండా మూడు నెలలుగా మ్యానేజ్ చేశాడు. అయితే నాణెలు మింగుతూ ఉండటం వల్ల కడుపు ఉబ్బిపోయి, పొట్టి నొప్పితో ఆస్పత్రికి వచ్చాడు. అసలు కథ తెలిసిన వైద్యులు ఖంగుతిన్నారు. పొట్టిలోంచి దాదాపు 187 కాయిన్స్‌ను బయటకు తీశారు. ఈ ఘటన కర్ణాటకలోని బాగల్ కోటలో జరిగింది.
బాగల్‌కోట్ జిల్లాలోని శ్రీ కుమారేశ్వర ఆసుపత్రిలో దయ్యప్ప హరిజన్‌కు జరిగిన ఈ శస్త్రచికిత్సలో రోగి కడుపు నుండి 187 నాణేలను తొలగించారు. కడుపు నొప్పి, నిరంతర వాంతులు వస్తున్నాయని సదరు వ్యక్తిని కుటుంబ సభ్యులు హాస్పిటల్లో జాయిన్ చేశారు. వైద్యులు సాధారణ పరీక్ష తర్వాత, రోగికి ఎక్స్-రే , ఎండోస్కోపీ చేయడంతో అసలు విషయం బయటపడింది. అతని కడుపులో నాణెలున్నాయని గుర్తించారు.
శస్త్రచికిత్స విజయవంతమై రోగి కడుపులో నుంచి 187 నాణేలను బయటకు తీసింది వైద్య బృందం. అందులో 5 రూపాయల నాణేలు 56, 2 రూపాయల 51 నాణేలు, 1 రూపాయి నాణేల సంఖ్య 80. 58 ఏళ్ల రోగి దయ్యప్ప మానసికంగా కుంగిపోయాడని, గత మూడు-నాలుగు నెలల్లో నెమ్మదిగా ఇంత పెద్ద మొత్తంలో నాణేలను మింగాడని ఆ తరువాత తెలిసిందే.
ఇలా నాణెలు మింగుతున్నాడనే విషయం మాకు తెలియదని కుటుంబ సభ్యులు తెలిపారు. అతని మానసిక పరిస్థితి బాగా లేదని తెలుసు, అయినా కూడా రోజువారీ పనిని సక్రమంగా చేసేవాడని ఫ్యామిలీ మెంబర్స్ తెలిపారు. మొత్తానికి వైద్యులు చికిత్స చేసి వాటన్నంటిని తీయడంతో సదరు వ్యక్తి ఇప్పుడు క్షేమంగానే ఉన్నాడు. కిడ్డీ బ్యాంకులో వేసుకున్నట్టుగా డబ్బులు వేసుకున్నాడా? అని జనాలు కామెంట్లు చేస్తున్నారు.
Also Read : Bigg Boss Samrat New Car : కొత్త కారు కొన్న బిగ్ బాస్ సామ్రాట్.. ధర ఎంతంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook