Throwing Currency Notes: ప్రస్తుత స్మార్ట్ యుగంలో ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా ఇట్టే నెట్టింట క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి ఎంతగైనా తెగిస్తున్నారు. చిత్రవిచిత్ర వేషాలు వేస్తూ.. నెట్టింట వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. అయితే ఇలాంటి చర్యల వల్ల వాళ్ల ఇబ్బందులు ఎదుర్కొవడమే కాకుండా.. ఇతరులకు కూడా కష్టాలను తెచ్చి పెడుతోంది. తాజాగా ఓ యువకుడు నోట్ల కట్టలను కారులో నుంచి రోడ్డుపైకి విసిరేశాడు. ల్లీకి ఆనుకుని ఉన్న గురుగ్రామ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు రన్నింగ్ కారు నుంచి నోట్లను విసురుతున్నట్లు వీడియోలో ఉంది. ఈ వైరల్ వీడియోను పోలీసులు ధృవీకరించారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వీడియో కేవలం 15 సెకన్లు మాత్రమే ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓ యువకుడు కారు నడుపుతుంగా.. మరో యువకుడు వెనుక నుంచి కరెన్సీ నోట్లను విసిరేస్తున్నాడు. అయితే నోట్ల కట్టలు విసురుతున్న యువకుడు ముఖానికి గుడ్డ కట్టుకుని ఉన్నాడు. కారు ట్రంకు పెట్టెలోంచి డబ్బును రోడ్డుపై విసిరేస్తున్న సమయంలో వెనుక నుంచి ఎవరో వీడియో తీశారు. ఈ సీన్ మొత్తం రాత్రివేళలో జరిగింది.


 




ఆ సమయంలో రోడ్డు కూడా ఖాళీగా ఉంది. ప్రస్తుతం పోలీసులు విచారణలో నిమగ్నమై ఉన్నారు. డబ్బులు విసిరిన యువకులను గుర్తించారు. కారులోంచి కరెన్సీ నోట్లను విసిరి.. ఓ సినిమాలోని సీన్‌ని రీ-క్రియేట్ చేసేందుకు ఇద్దరు యువకులు ప్రయత్నించినట్లు వెల్లడించారు. ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. ప్రధాన నిందితుడు వికాస్ కౌశిక్‌గా గుర్తించామన్నారు. 


సోషల్ మీడియాలో వైరల్ కావడానికి, ఫేమస్ కావడానికి యువతీ, యువకులు చేసే వింతలు రోజురోజుకూ నెట్టింట కనిపిస్తున్నాయి. వీడియో వైరల్ అయిన తర్వాత లేదా పోలీసులు తీసుకునే చర్యలకు కూడా బాధ్యులు అవుతున్నారు. ఇలాంటి సీన్లు సినిమాల్లోనే కనిపిస్తాయని.. నిజజీవితంలో ఇలాంటి కార్ల నుంచి నోట్లు విసేసిన తీరు కూడా డబ్బు మత్తును తెలియజేస్తుందని నెటిజన్లు అంటున్నారు. 


Also Read: TSPSC Paper Leak: పేపర్ లీకేజీ వ్యవహారంలో కీలక మలుపు.. గ్రూప్ 1 పేపర్ కూడా లీక్..?


Also Read: Advance Tax: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. రేపే లాస్ట్ డేట్   



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి