Manager Caught Watching Lust Stories 2 : కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి సమయంలో చాలా రంగాల్లో, చాలా మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ పరిచయమైంది. కరోనా కంటే ముందు నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్‌కి పలు కంపెనీలు అవకాశం కల్పించినప్పటికీ.. కరోనా తరువాత అది విశ్వవ్యాప్తమైంది. వర్క్ ఫ్రమ్ హోమ్‌లో భాగంగానే ఆన్‌లైన్ గంటల తరబడి సమావేశాలను కూడా పరిచయం చేసింది. ఇప్పటికీ కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌కి అనుమతిస్తుండగా.. ఇంట్లో ఇబ్బందులు కారణంగా ఆఫీసుకు రాలేని వారు కూడా కంపెనీ నుంచి అనుమతి తీసుకుని వర్క్ ప్రమ్ హోమ్ చేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్‌కి సంబంధించి కోవిడ్-19 నుంచి ఇప్పటి వరకు ఎన్నో వీడియోలు, ఫోటోలు, మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవడం మనం చూస్తూనే ఉన్నాం. ఆఫీస్ స్టాఫ్‌తో ఆన్‌లైన్ మీటింగ్ జరుగుతున్న సమయంలోనే వెనుక బ్యాగ్రౌండ్‌లో కుటుంబసభ్యులు బనియన్‌పై అటూఇటూ తిరుగుతుండటం, మరొకరు బ్యాగ్రౌండ్లో ఫోన్ మాట్లాడుతూ ఇష్టమొచ్చినట్టు పిచ్చాపాటి వేయడం, ఇంకొన్ని సందర్భాల్లో ఇంట్లో ఉండే పిల్లి, కుక్క పిల్ల వంటి పెంపుడు జంతువులు స్క్రీన్ ముందుకొచ్చి కూర్చోవడం, వింత వింత శబ్ధాలు చేయడం ఇలా ఎన్నో వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, అవన్నీ ఒక ఎత్తు.. తాజాగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం మరొక ఎత్తు అంటున్నారు సోషల్ మీడియాలో ఈ న్యూస్ చూసిన నెటిజెన్స్.


సోషల్ మీడియాలో ఒక మహిళ ఒక పోస్ట్ షేర్ చేసుకున్నారు. తన మేనేజర్ ఆన్‌లైన్ మీటింగ్‌లో ఇతరులతో స్క్రీన్‌ షేర్ చేసుకుంటున్నాను అనే విషయం మర్చిపోయి అదే స్క్రీన్‌పై అతడు లస్ట్ స్టోరీస్ -2 చూస్తున్నాడని.. కానీ అతడి స్క్రీన్ షేరింగ్‌లో ఉండటంతో ఆ మేనేజర్ మాకు అడ్డంగా దొరికిపోయాడని ఆమె ట్వీట్ చేసింది. అదే ట్వీట్‌లో తన మేనేజర్ లస్ట్ స్టోరీస్ చూస్తూ దొరికిపోయాడనడానికి తగిన ఆధారంగా స్క్రీన్ షాట్‌ని కూడా పోస్ట్ చేశారు.


ఇది కూడా చదవండి : Most Searching On Smartphones: చాలామంది స్మార్ట్‌ఫోన్‌లో ఏం చేస్తున్నారో తెలుసా ?


ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన లస్ట్ స్టోరీస్ వెబ్‌సిరీస్‌లో విజయ్ వర్మ, మన మిల్కి బ్యూటీ తమన్నా భాటియా రొమాన్స్ సన్నివేశానికి సంబంధించిన స్క్రీన్‌షాట్ ఈ ట్విటర్ పోస్టులో చూడొచ్చు. సోషల్ మీడియా సాక్షిగా ఆ మేనేజర్ పరువు గంగపాలైంది. అయితే, ఈ పోస్ట్ చేసిన నెటిజెన్ ఆ మేనేజర్ పేరు వివరాలను బ్లర్ చేయడంతో అతడు ఎవరు ఏంటి అనేది తెలిసే అవకాశం లేకపోయింది. అలా ఆ మేనేజర్ కొంత సేఫ్ అయ్యాడు. ఏదైమైనా ఇదే మీటింగ్‌లో పాల్గొన్నవారికి మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది తమ మేనేజర్ లస్ట్ స్టోరీనే అనే విషయం అందరికీ తెలిసే తీరుతుంది


ఇది కూడా చదవండి : Popcorn Bill = Amazon Prime Cost: థియేటర్లో పాప్‌కార్న్‌కి అయ్యే ఖర్చుతో ఇంట్లోనే కూర్చుని ఏడాది మొత్తం సినిమాలు చూడొచ్చు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK