Mark Zuckerberg Blessed with Baby Girl: ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకుడు, మెటా సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ జుకర్‌బర్గ్, అతని భార్య డాక్టర్ ప్రిసిల్లా చాన్ దంపతులు పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. తాజాగా పుట్టిన బిడ్డతో కలిపి వారి సంతానం మొత్తం మూడుకు చేరింది. మార్క్ జుకర్‌బర్గ్ తన మూడవ కుమార్తె అరేలియా చాన్ జుకర్‌బర్గ్ కలిసి తీసుకున్న ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి. "ఆరేలియా చాన్ జుకర్‌బర్గ్.. ఈ ప్రపంచంలోనికి నీకు స్వాగతం అంటూ మార్క్ జుకర్‌బర్గ్ రెండు ఫోటోలను పోస్ట్ చేశాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మార్క్ జుకర్‌బర్గ్ పోస్ట్ చేసిన రెండు ఫోటోల్లో ఒక ఫోటోలో చిన్నారి తన తండ్రిని చూస్తూ నవ్వుతూ కనిపించగా.. రెండో చిత్రంలో మార్క్ జుకర్‌బర్గ్ భార్య చాన్ ఆ పసికందును గుండెలకు హత్తుకుని పడుకోవడం చూడొచ్చు. మార్క్ జుకర్‌బర్గ్ ఈ గుడ్ న్యూస్ చెబుతూ చేసిన పోస్టుకు భారీ స్పందన కనిపించింది. దాదా 3 లక్షలకు పైగా ఇన్ స్టాగ్రామ్ యూజర్స్ ఈ పోస్టును లైక్ చేయగా.. ఇంకెంతో మంది నెటిజెన్స్ మార్క్ జుకర్‌బర్గ్ దంపతులకు కంగ్రాట్స్ చెబుతూ కనిపించారు.


మార్క్ జుకర్‌బర్గ్ గత ఏడాది సెప్టెంబర్‌లో తన భార్య చాన్ ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని కూడా ఇలాగే సోషల్ మీడియా పోస్ట్ ద్వారా యావత్ ప్రపంచంతో షేర్ చేసుకున్నాడు. వచ్చే సంవత్సరం తమ పిల్లలు ఆగస్ట్, మ్యాక్స్ లకు మరో తోడు రాబోతోంది అంటూ మార్క్ జుకర్‌బర్గ్ ఆ పోస్ట్ షేర్ చేశాడు. మార్క్ జుకర్‌బర్గ్ దంపతులు 2012 లో వివాహం చేసుకున్నారు. ఇప్పటికే వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో పెద్ద కూతురు మాక్సిమా (మ్యాక్స్) వయస్సు ఏడేళ్లు కాగా.. చిన్న కూతురు ఆగస్టు వయస్సు ఐదేళ్లు. మార్క్ జుకర్‌బర్గ్ చెప్పినట్టుగా వీళ్లిద్దరికి తోడుగా తాజాగా మూడో సంతానం వచ్చిచేరింది. 



 


మార్క్ జుకర్‌బర్గ్, చాన్ కాలేజీ రోజుల్లోనే ప్రేమలో పడ్డారు. చాన్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత కాలిఫోర్నియా యూనివర్శిటీలో వైద్య విద్యను అభ్యసించారు. ప్రస్తుతం ఆమె ఒక పీడియాట్రిషియన్ గా స్థిరపడ్డారు. హార్వర్డ్ యూనివర్శిటీలో ఒక పార్టీలో కలుసుకున్న తర్వాత 2003లో వీళ్లిద్దరూ డేటింగ్ చేయడం మొదలుపెట్టారు. మే 19, 2012న మార్క్ జుకర్‌బర్గ్, చాన్ పెళ్లి చేసుకున్నారు.


ఇది కూడా చదవండి : Galaxy F23 5G for Rs 549: జస్ట్ రూ. 549 కే రూ 23999 విలువైన గెలాక్సీ 5G ఫోన్


ఇది కూడా చదవండి : Redmi Note 12: రెడ్‌మి నోట్ 12.. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK