WhatsApp Christmas 2020 Stickers: క్రిస్మస్ స్టిక్కర్లను ఇలా ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోండి
WhatsApp Christmas 2020 Stickers Download: ఏదైనా ఈవెంట్‌గానీ లేక పండుగగానీ వచ్చిందంటే చాలు వాట్సాప్‌లో మెస్సేజ్‌ల మోత మోగాల్సిందే. అయితే కొన్నిసార్లు మనకు కొత్త ఈవెంట్ రాగానే ఫొటోలు లేక స్టిక్కర్లు ఎలా దొరుకుతాయని వెతుకుతుంటారు. క్రిస్మస్ 2020 సిక్కర్లు డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.
WhatsApp Christmas 2020 Stickers Download: ఈరోజుల్లో ఏదైనా ఈవెంట్‌గానీ లేక పండుగగానీ వచ్చిందంటే చాలు వాట్సాప్‌లో మెస్సేజ్‌ల మోత మోగాల్సిందే. అయితే కొన్నిసార్లు మనకు కొత్త ఈవెంట్ రాగానే ఫొటోలు లేక స్టిక్కర్లు ఎలా దొరుకుతాయని వెతుకుతుంటారు. మరికొందరైతే అవి ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలియక ఇతరులు పంపిన పాత స్టిక్కర్లు, ఫొటోలను ఫార్వర్డ్ చేస్తుంటారు.
ప్రస్తుతం క్రిస్మస్ 2020 (Christmas 2020) వచ్చేసింది. ఒకరోజు ముందు నుంచే తమ సన్నిహితులు, బంధువులు, మిత్రులకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు చేస్తుంటారు. ఇప్పుడు వాట్సాప్ సైతం ప్రతి ఈవెంట్, పండుగకు కొత్త స్టిక్కర్లను విడుదల చేసింది. వీటిని మీరు డౌన్‌లోడ్ చేసుకుని మీ సన్నిహితులు, బంధుమిత్రులకు ఎంచక్కా కొత్త కొత్త క్రిస్మస్ స్టిక్కర్లను షేర్ చేసుకోవచ్చు. కోవిడ్19 సమయంలో ఈ ఏడాది క్రిస్మస్‌ను జరుపుకుంటున్నాం. క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ, కొత్త కొత్త వాట్సాప్ స్టిక్కర్లు షేర్ చేస్తూ పండుగను మరింత ఆనందంగా సెలబ్రేట్ చేసుకోంది.
Also Read: Amazon Fab Phones Fest: స్మార్ట్‌ఫోన్లపై అమెజాన్ బంపర్ ఆఫర్లు ఇవే..
వాట్సాప్ (WhatsApp)లో క్రిస్మస్ స్టిక్కర్లు డౌన్‌లోడ్ చేసుకుని షేర్ చేసుకునే విధానం మీకోసం..
స్టెప్ 1: మీ మొబైల్, పీసీ లేక ల్యాప్‌టాప్‌లో వాట్సాప్ ఓపెన్ చేయండి
స్టెప్ 2: మీరు క్రిస్మస్ స్టిక్కర్లను పంపించాలనుకుంటున్న వ్యక్తి లేక వాట్సాప్ గ్రూప్‌లోకి వెళ్లాలి.
స్టెప్ 3: ఎమోజీ విభాగంలో ‘స్టిక్కర్లు’ ట్యాబ్ ఓపెన్ చేయండి.
స్టెప్ 4: స్టిక్కర్ విండోలో కుడివైపు పై మూలలో ఉన్న ‘+’ బటన్‌పై క్లిక్ చేయండి
స్టెప్ 5: అందులో మీకు నచ్చిన స్టిక్కర్ ప్యాక్‌లను ఎంచుకోవాలి. మరిన్ని క్రిస్మస్ స్టిక్కర్స్ కావాలనుకుంటే ‘Get More Stickers’ మీద క్లిక్ చేసి బ్రౌజ్ చేయండి. Also Read: WhatsApp Features: మీ వాట్సాప్‌లో మెస్సెజ్‌లు కుప్పలుతెప్పలుగా వస్తున్నాయా.. ఇలా చేస్తే సరి!
స్టెప్ 6: అది గూగుల్(Google) ప్లే స్టోర్‌కు వెళ్తుంది, అందులో ఉండే వాట్సాప్ సిక్కర్లు మీకు స్క్రీన్ మీద కనిపిస్తాయి.
స్టెప్ 7: ఇక్కడ మీకు నచ్చిన యాప్ స్టిక్కర్లను ఎంచుకోవచ్చు. లేక మీరు కావాలనుకున్న స్టిక్కర్లను పేరుతో సెర్చ్ చేయవచ్చు.
స్టెప్ 8: ఒక కచ్చితమైన యాప్‌ను సెలక్ట్ చేసుకుని, డౌన్‌లోడ్ చేయాలి. అనంతరం ఇన్‌స్టాల్ చేయండి
స్టెప్ 9: వాట్సాప్ ఓపెన్ చేసి మీకు కావలసిన వ్యక్తి, లేక గ్రూపు ఓపెన్ చేసి డౌన్‌లోడ్ చేసుకున్న స్టిక్కర్లను రెగ్యూలర్ విధానంలో షేర్ చేసుకోండి.
Also Read: Spy Features Of WhatsApp: మీ ఫ్రెండ్స్‌కు తెలియకుండా వాట్సాప్ స్టేటస్ చూసేద్దామా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook