Minnal Murali Wedding Shoot: ఈమధ్య ప్రీ వెడ్డింగ్ షూట్స్ వినూత్నంగా షూట్ చేస్తున్నారు. ఖర్చు కోసం వెనుకాడట్లేదు. తమ క్రియేటివిటీకి పదును పెడుతూ... సినిమా స్టైల్లో వెడ్డింగ్ షూట్స్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఓ కొత్త కపుల్ మలయాళ మూవీలోని సీన్ తరహాలో షూట్ నిర్వహించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవల మలయాళంలో విడుదలై సూపర్ హిట్ అందుకున్న చిత్రం 'మిన్నాళ్ మురళి' (Minnal Murali). మలయాళంలో మాత్రమే కాదు.. ఈ సినిమా ప్రతీ భాషలో చూసిన వారి దగ్గర నుండి ప్రశంసలు అందుకుంటోంది. సింపుల్‌గా చెప్పాలంటే మిన్నాళ్ మురళి.. ఇండియన్ సూపర్ మ్యాన్. దర్శక ధీరుడు రాజమౌళి సైతం ఈ చిత్రం బాగుందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


Also Read: Methuselah: ఈ చేప వయసు 90 ఏళ్లు.. భూమిపై ఎక్కువ వయసున్న చేప ఇదే!


ఆ మిన్నాళ్ మురళీ క్యారెక్టర్‌ను అమితంగా ఇష్టపడిన ఓ వ్యక్తి తన ఫ్రీ వెడ్డింగ్ వీడియోలో (Minnal Murali Wedding Shoot) తానే మిన్నాళ్ మురళిగా రెడీ అయ్యాడు. తనకు కాబోయే భార్యను పెళ్లి చేసుకున్నాడు. కేరళలోని (Kerala) కొట్టాయం జిల్లాలో ఈ వీడియో చిత్రీకరించారు. ఈ వెడ్డింగ్ వీడియో సోషల్ మీడియోలో హాల్ చల్ చేస్తోంది. ఈ వీడియోకు నెటిజన్స్  తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి