Mobile Phone Exploded: మొబైల్ ఫోన్ సొంతంగా రిపేర్ చేయాలన్నా.. రిపేరింగ్‌కి తీసుకెళ్లాలన్నా భయపడేంతగా ఈ వీడియోలో ఏముంది అని అనుకుంటున్నారా ? మరేం లేదండీ.. మొబైల్ ఫోన్ చార్జింగ్ అవడం లేదంటూ ఒక కస్టమర్‌ తమ ఫోన్ తీసుకుని రిపేరింగ్ షాప్‌కి వచ్చాడు. చార్జింగ్ ప్రాబ్లం ఎందుకో చూద్దామనుకున్న మొబైల్ మెకానిక్.. దాన్ని చేతుల్లోకి తీసుకుని ఒక పరికరం సహాయంతో బ్యాటరీని బయటికి తీయబోయాడు. అంతే.. క్షణాల్లోనే ఢాం అంటూ పెద్ద శబ్ధంతో పేలిపోయింది ఆ ఫోన్. ఆ పేలుడుతో అద్దిరిపడిన మెకానిక్.. చావుని చేతుల్లో చూసినంత భయపడ్డాడట. ఎప్పటి నుంచో మెకానిక్ పని చేస్తున్నా.. ఇప్పటి వరకు ఎన్నో మొబైల్ ఫోన్లు రిపేర్ చేసినా.. ఎప్పుడూ ఇలా జరగలేదని వాపోయాడు సదరు సెల్ ఫోన్ మెకానిక్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మెకానిక్ తన ముందున్న రిపేరింగ్ కౌంటర్‌కి ఇవతల వైపు నిలబడి ఉండగా.. కౌంటర్‌కి అవతల వైపు కస్టమర్ నిలబడి ఉన్నాడు. ఆ మొబైల్ పేలుడు ధాటికి కస్టమర్‌ది కూడా దాదాపు అదే పరిస్థితి. ఇద్దరూ ఏం జరిగిందో అర్థం చేసుకునేలోపే పేలిన ఫోన్ కాస్తా మంటల్లో తగలబడుతూ కనిపించింది. అంతా క్షణాల్లో జరిగిపోయింది.


 



 


ఉత్తర్ ప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌లో పాలి ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన దుకాణంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ఈ వీడియోను ఒక ట్విటర్ యూజర్ ట్విటర్‌లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. అయితే, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు చాలా మందికి మొదటగా కలిగే సందేహం ఏంటంటే.. ఇంతకీ ఆ ఫోన్ ఏ కంపెనీది, ఏ మోడల్ ఫోన్.. కంపెనీ ఈ ఘటనపై స్పందించిందా లేదా అని. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఏదైనా ఫోన్ ఇలా పేలినప్పుడు ఆ ఫోన్ తయారీదారుడు ఆ ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించి అంతర్గతంగా దర్యాప్తు చేయిస్తారు. అంతేకాకుండా కంపెనీ ఇమేజీ డ్యామేజ్ కాకుండా ఉండేందుకు సదరు ఫోన్ యూజర్‌కి మరో కొత్త ఫోన్ రూపంలో నష్టపరిహారం చెల్లించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈ ఘటనలో ఆ వివరాలు ఏవీ ఇక్కడ వెల్లడించకపోవడంతో ప్రస్తుతానికి ఫోన్ కంపెనీ, మోడల్ ఏంటనే వివరాలు ఇంకా బయటికి రాలేదు. 


Also Read : వైరల్ వీడియో.. ఈ పెద్దాయన టపాకాయలు ఎలా కాల్చుతున్నాడో చూడండి! నవ్వు ఆపుకోలేరు


Also Read : Man Kisses Cobra: కింగ్ కోబ్రా తలపై ముద్దు పెట్టుకున్న వ్యక్తి, వీడియో వైరల్


Also Read : Chopper Flying on Road: వాహనాలపైకి దూసుకొచ్చిన హెలీక్యాప్టర్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న వైరల్ వీడియో



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి