Mobile Snatching Video: ఒకమ్మాయి రోడ్డుపై ఫోన్‌ మాట్లాడుతూ తీరిగ్గా నడుచుకుంటూ వెళ్తోంది. ఇంతలో స్కూటీపై రయ్యిమని దూసుకొచ్చిన ఓ యువకుడు ఆమె చేతిలో ఫోన్ లాగేసుకుని తలపై ఒక్కటిచ్చాడు. అంతే.. ఆమె కింద పడిపోగా.. ఆ యువకుడు కొట్టేసిన మొబైల్ ఫోన్‌‌తో అక్కడి నుంచి ఉడాయించాడు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి దొంగను పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ అతను తప్పించుకున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ అమ్మాయి ఏడుస్తూ సహాయం చేయాలని కోరడంతో ఇద్దరు వ్యక్తులు బైక్‌పై అతన్ని వెంబడించారు. ఎట్టకేలకు ఒకచోట అతన్ని పట్టుకోగలిగారు. అనంతరం అతన్ని ఆ అమ్మాయి వద్దకు తీసుకొచ్చారు. ఆ దొంగను చూడగానే ఆమె ఆశ్చర్యపోయింది. ఆమె ఆశ్చర్యం చూసి అతన్ని పట్టుకున్న వ్యక్తులు కూడా ఆశ్చర్యపోయారు. ఏమైందని అడిగితే... అతను తన బాయ్‌ఫ్రెండ్ అని అసలు విషయం చెప్పింది. దీంతో ఆ ఇద్దరు షాక్ తిన్నారు.మొబైల్ ఫోన్ కొట్టేసిన ఆ యువకుడి తలపై ఒక్కటిచ్చారు.


'హైదరాబాద్ మేరే జాన్' అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియో అప్‌లోడ్ అయింది. రెండు వారాల క్రితం అప్‌లోడ్ అయిన ఈ వీడియోకి ఇప్పటికే 4,75,862 లైక్స్ వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. బాయ్‌ఫ్రెండ్ అయ్యాక.. అతను దొంగ కూడా అయిపోయాడన్నమాట అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇది నిజంగా జరిగిందా లేదా ఫేకా అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. బహుశా ఆ అమ్మాయి ఎప్పుడు ఎవరితో మాట్లాడుతుందో చెక్ చేయాలనుకున్నాడేమో అంటూ ఇంకొందరు కామెంట్స్ చేశారు. ఇప్పుడీ వీడియో ఇన్‌స్టాలో తెగ వైరల్ అవుతోంది.



Also Read: Noida Supertech twin towers demolition LIVE Updates: 9 సెకన్లలో 40 అంతస్తులు నేలమట్టం.. కాసేపట్లో నోయిడా ట్విన్ టవర్స్‌ కూల్చివేత


Also Read: MLA Daughter Death: బీజేపీ ఎమ్మెల్యే కూతురి మృతి.. నిద్రలోనే మరణం.. పోస్టుమార్టమ్ రిపోర్టులో ఏం తేలిందంటే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook