Money rain: Gujarati folk singer Urvashi Radadiya showered with cash in viral video : అభిమానుల అభిమానానికి అంతే ఉండదు అనడానికి ఈ ఘటనే నిదర్శనం. సాధారణంగా ఫ్యాన్స్.. వారి అభిమాన నటీనటులకు పాలాభిషేకం, పూలాభిషేకం చేయడం చూస్తుంటా... కానీ ఒక సింగర్‌కు.. ఆమె ఫ్యాన్స్ డబ్బుల నోట్లతో అభిషేకం చేశారు. రాధాదియా అనే గుజరాతి ఫోక్ సింగర్ (Gujarati folk singer Urvashi Radadiya) ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొంది. గుజరాత్‌కు చెందిన శ్రీ సమస్త్‌ హరిద్వార్‌ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె సంగీత కచేరీ ఇచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read : రేపు ఢిల్లీకి సీఎం కేసీఆర్‌.. కేంద్రానికి మూడు డిమాండ్లు..రెండ్రోజుల్లో తేల్చుకోని వస్తాం


ఊర్వశి గాత్రానికి..ఆమె అభిమానులు ఉప్పొంగిపోయారు. ఆమెపై నోట్ల వర్షాన్ని కురిపించారు. ఒక ఫ్యాన్ అయితే ఏకంగా ఒక బకెట్ నిండా డబ్బులు (bucketful of money) తీసుకొచ్చి.. ఆమెపై పోశాడు. తనపై కురిపించిన ఈ నోట్ల వర్షానికి సంబంధించి వీడియోను ఊర్వశి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియో (video) సోషల్ మీడియాలో (social media) తెగ వైరల్ (viral) అవుతోంది. 



 


ఆమె పాటలు పాడుతున్నంతసేపు స్టేజి మీద ఉన్న సంఘం సభ్యులు, కింద ఉన్న ఫ్యాన్స్, ప్రేక్షకులు (audience) ఆమెపై కరెన్సీ నోట్ల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించారు.. వేలాది మంది లైక్‌ చేశారు. జానపద గాయని రాధాదియా (folk singer Urvashi Radadiya) గాత్రం అద్భుతంగా ఉంటుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Also Read : బ్రేకింగ్: హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ బిల్డింగ్‌లో మంటలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook