Monkey drinks Beer at Rae Bareli in Uttar Pradesh: అసలే కోతి.. ఆపై కల్లు తాగిందనే సామెత మనందరికీ గుర్తుండే ఉంటుంది. అక్షరాల ఆ సామెతను ఓ కోతి నిజం చేసింది. మందుబాబులకు తానేం తక్కువ కాదు అన్నట్లుగా ఓ కోతి దర్జాగా మందేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో చోటుచేసుకొంది. రాయ్‌బరేలీలో కోతులు మందుబాబులతో పోటీగా మద్యం దుకాణాలకు వెళ్లి.. బీర్, విస్కీ, రమ్ము ఏదైనా ఓకే అంటూ తాగేస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గడగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అచల్‌గంజ్ ప్రాంతంలోని ఓ మద్యం దుకాణం వద్ద కోతులు తెగ హడావుడి చేస్తున్నాయి. మద్యం దుకాణంపై పడి.. కస్టమర్స్ చేతిలో నుంచి మద్యం దొంగిలిస్తున్నాయి. అంతేకాదు ఎత్తిన బీరు దించకుండా తాగేస్తున్నాయి. ఈ క్రమంలోనే కోతి మద్యం తాగుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో కోతి కోక్ బీర్ తాగుతూ కనిపించింది. పక్కన ఉన్న మందుబాబులు కొందరు దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. 



మద్యం దుకాణం దగ్గర ఓ కోతి హంగామా సృష్టిస్తుండడంతో యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారట. తమ దుకాణాల నుంచి మద్యం దొంగిలిస్తుందని, కస్టమర్ల దగ్గర నుంచి బాటిళ్లను కూడా లాక్కొని తాగుతుందని ఫిర్యాదు చేశారట. కోతిని ఎలాగైనా పట్టుకోవాలని వేడుకున్నారట. రంగంలోకి దిగిన ఎక్సైజ్ అధికారులు.. అటవీ శాఖ సహకారంత కోతిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఏదేమైనా ఈ కోతికి సంబందించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసిన వారు పగలపడి నవ్వుకుంటున్నారు. 


Also Read: సబ్బు పెట్టిమరీ.. బట్టలు ఉతుకుతున్న కోతి! రన్నింగ్ కామెంటరీ వింటే నవ్వాగదు


Also Read: Acharya TRP Ratings : బాలయ్య, నాగ్, వెంకీల కన్నా దారుణం.. చిరు సినిమా స్థానమిదే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook