Monkey Trending Video: సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అందులో చాలా వరకు యాక్సిడెంట్ సన్నివేశాలకు సంబంధించిన వైతే మరికొన్ని మాత్రం ఫన్నీ వీడియోస్, జంతువులకు సంబంధించిన వీడియోస్ ఉంటాయి. గత కొన్ని నెలల నుంచి సోషల్ మీడియాలో ఎలాంటి వీడియోలు షేర్ చేసిన లక్షల్లో రీచ్ వస్తోంది. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలైతే షేర్ చేసిన నిమిషాల వ్యవధిలోనే కొన్ని కోట్ల మంది వీక్షిస్తున్నారు. ముఖ్యంగా కోతులకు సంబంధించిన వీడియోలైతే ఎక్కువగా షేర్ అవుతూ ఉంటాయి. ఇటీవల కూడా ఓ కోతికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిని చూసిన నేటిజన్స్.. ఇది నిజమైన, కోతి ఇలా చేస్తుందా? అని అంటున్నారు. నిజానికి కోతి ఏం చేసింది? వైరల్ అవుతున్న వీడియో నిజమేనా? ఇంతకీ వీడియోలో ఏముంది? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి..




COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


మనం తరచుగా సోషల్ మీడియాలో కోతులకు సంబంధించిన వీడియోలను చూస్తూ ఉంటాము. కానీ ఈ వీడియో మాత్రం అన్ని వీడియోల కంటే ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ వీడియోలో ఒక కోతి ఏకంగా అయ్యప్ప స్వామి దేవాలయంలో వెలిగించిన కర్పూర హారతికి దండం పెట్టింది. ఇలాంటి కోతులు చాలా అరుదుగా ఉంటాయి. మనుషులు చేసిన పనులను దృష్టిలో పెట్టుకొని కొన్ని కోతులు ఇలా అవి కూడా అనుసరిస్తాయని అధ్యయనాల్లో తేలింది. ఈ కోతి కూడా మనుషుల్లా కర్పూర హారతి తీసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. చాలామంది నెటిజన్స్ ఈ వీడియో పై స్పందిస్తున్నారు. 


గతంలో ఓ కోతి నేరుగా శివాలయానికి వెళ్లి అభిషేకం చేస్తున్న శివలింగం దగ్గర కూర్చుని వెళ్లడానికి సంబంధించిన వీడియో చూశాం. కానీ ఈ వీడియో మాత్రం అన్నిటికంటే చాలా భిన్నంగా ఉంది. ఈ వీడియో చూసిన కొంతమంది నెటిజన్స్ సాక్షాత్తు హనుమంతుడే అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చాడని..హారతి తీసుకున్నాడని అభిప్రాయపడుతున్నారు. మరి కొంతమంది అయితే సాక్షాత్తు శ్రీరాముడే వచ్చినట్లు కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా కోతి ఇలా హారతి తీసుకోవడం ఒక వింతే.. ప్రస్తుతం ఈ కోతికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.



ఇక ఈ వీడియో వివరాల్లోకి వెళితే.. ఈ వీడియోను శబరిమల మణికంఠ స్వామి అని ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటికీ కొన్ని లక్షల మందికి పైగా వీక్షించగా 26వేల మందికి పైగా లైక్ చేశారు. అంతేకాకుండా వందమందికి పైగా ఈ వీడియోకు సంబంధించిన అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యక్తం చేశారు. అలాగే ఈ వీడియోను 5000 మందికి పైగా షేర్ చేశారు. ఇప్పటికీ ఈ వీడియో పోస్ట్ చేసి కొన్ని రోజులు కావస్తున్న ఏమాత్రం తగ్గకుండా సోషల్ మీడియాలో దూసుకుపోతోంది.


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter