Viral Monkey Videos: స్మార్ట్‌ ఫోన్, ఇంటర్నెట్ పుణ్యమాని ఈరోజుల్లో వైరల్ వీడియోలకు (Viral Video) కొదువ లేకుండా పోయింది. ఎక్కడ ఏం జరిగినా సరే... స్మార్ట్‌ ఫోన్‌లో చిత్రీకరించి క్షణాల్లో ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. అందులో మంచి, చెడు రెండూ ఉంటున్నాయి. చెడు సంగతి పక్కనపెడితే... కొన్ని వైరల్ వీడియోలు మాత్రం స్ట్రెస్ బస్టర్‌లా పనిచేస్తాయంటే అతిశయోక్తి కాదేమో. ఉరుకుల పరుగుల జీవితంలో కాసేపు ఆ వీడియోలు చూసి హాయిగా నవ్వుకోవచ్చు... కాస్త రిలీఫ్‌గా ఫీల్ అవొచ్చు. అలాంటివే రెండు మంకీ వీడియోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొదటి వీడియోలో రెండు అల్లరి కోతులు ముద్దుల్లో (Monkey Kissing) మునిగితేలడం గమనించవచ్చు. బండరాయిపై కూర్చొన్న కోతి భుజాల పైకి మరో కోతి ఎక్కి.. దాని పెదాలను ముద్దాడుతోంది. అలా కొద్దిసేపు ముద్దులో మునిగితేలాక మళ్లీ కిందకు దిగి... దాని తల వెంట్రుకల్లో పేలు చూస్తోంది. ఈ కోతుల రొమాన్స్‌కు సంబంధించిన వీడియోను మంకీ జంగిల్ క్లబ్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేశారు. ఇప్పటివరకూ ఈ వీడియోకి 23వేల పైచిలుకు లైక్స్ వచ్చాయి.


ఇక మరో వీడియోలో ఓ పిల్ల కోతి తన తల్లి నిద్ర చెడిపోకుండా ఉండేందుకు ఎంతలా ఆరాటపడుతుందో గమనించవచ్చు. తల్లి కోతి నిద్ర చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్న మరో కోతిని పిల్ల కోతి అడ్డుకుంటోంది. ఆ పిల్ల కోతి క్యూట్ నెస్... తల్లి నిద్ర చెడిపోకుండా ఉండేందుకు అది పడుతున్న ఆరాటం... వెరసి ఇంటర్నెట్‌లో ఆ వీడియో చాలామంది దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటివరకూ ఆ వీడియోకి (Viral Video) 18వేల పైచిలుకు లైక్స్ వచ్చాయి.




 


Also Read: Flash news: పోలీసుల బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు...14 మందికి గాయాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook