సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో చూస్తే మీకు నవ్వాలో లేక ఏడ్వాలో అర్థం కాక తల పట్టుకోవడం ఖాయం. రైల్వే స్టేషన్‌లో రైల్వే ట్రాక్ క్రాస్ చేయబోయిన ఓ వ్యక్తి కాలి బూటు జారడంతో మళ్లీ పట్టాలపైకి వెళ్లి బూటు తీసుకున్నాడు. అదే సమయంలో ప్లాట్‌ఫామ్‌పైకి రైలు వస్తుండటంతో అక్కడే ఉండలేక మళ్లీ వచ్చి ప్లాట్ ఫామ్ ఎక్కేందుకు ప్రయత్నించాడు. కాకపోతే నెమ్మదిగా అడుగులు వేయడంతో రైలు రానే వచ్చింది. ముందు నెమ్మదిగా అడుగులేసిన ఆ వ్యక్తి తీరా రైలు దగ్గరికొచ్చాకా వేగంగా వెళ్లి ప్లాట్‌ఫామ్ ఎక్కబోయాడు. కానీ అంతలోనే రైలు అతడిని సమీపించింది. ఈ ఎపిసోడ్ మొత్తాన్ని గమనిస్తున్న ముంబై పోలీసు కానిస్టేబుల్ అతడిని ఒక్క ఉదుటున పైకి లాక్కుని రైలు కింద నలిగిపోకుండా సేవ్ చేశాడు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రైలు పట్టాలపైకి రావొద్దని వారిస్తున్నా వినకుండా లైఫ్ రిస్క్ చేసిన ఆ 60 ఏళ్ల వ్యక్తిపై కోపం తెచ్చుకున్న సదరు పోలీస్ కానిస్టేబుల్.. వెంటనే అతడి చెంప చెళ్లుమనిపించాడు. కానిస్టేబుల్ చాకచక్యంగా వ్యవహరించకపోయుంటే.. అతడు రైలు ( Train ) కింద పడి నలిగిపోయే వాడేనని అంటున్నారు ఈ వీడియో చూసిన నెటిజెన్స్. ముంబైలోని దహిసుర్ రైల్వే స్టేషన్‌లో జనవరి 1న ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాల్లో ( CCTV cameras ) రికార్డయింది. Also read : Viral Video: ఈ ఎలుగుబంటి.. చాలా కూల్ గురూ!


Also read : Rang De Movie: సమ్మర్‌లోనే నితిన్ మూవీ.. డేట్ ఫిక్స్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook