Human finger in ice cream incident in mumbai: మనలో చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఐస్ క్రీమ్ లను ఎంతో ఇష్టంగా తింటారు. సమ్మర్ లో ఐస్ క్రీమ్ లకు ఉండే డిమాండ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొందరు రోజు ఏదో ఒక ఫ్లెవర్ ఐస్ క్రీమ్ ను ఇష్టంతో తింటారు. మరికొందరు ఇంట్లోనే వెరైటీలలో ఐస్ క్రీమ్ లను తయారు చేసుకుంటారు. మనం సాధారణంగా కొన్నిసార్లు స్నేహితులు, ఫ్యామీలీస్ తో కలిసి హోటల్స్ , రెస్టారెంట్లకు వెళ్తుంటాం. నచ్చిన ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ పెడుతుంటాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


ఇటీవల ఫుడ్ ఐటమ్స్ లలో పురుగులు తరచుగా వస్తున్న సంఘటనలు వార్తలలో ఉంటున్నాయి.  ఇంట్లోనే ఉండి ఆర్డర్ పెట్టుకున్న ఫుడ్ ఐటమ్స్ లలో కూడా పురుగుల అవశేషాలు వచ్చిన సంఘటనలు కొకొల్లలు. ఇలాంటి  ఘటనలు తరచుగా వార్తలలో ఉంటున్నాయి. ఈ క్రమంలో ముంబైలోని ఒక డాక్టర్ కు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆయనకు ఏకంగా ఆర్డర్ పెట్టిన ఐస్ క్రీమ్ లో మనిషి వేలు వచ్చింది. 


పూర్తి వివరాలు..


ముంబైలోని మలాడ్ లో ఉండే డాక్టర్.. ఓర్లెమ్ బ్రెండెన్ సెర్రావోకి ఐస్ క్రీమ్ తినాలినిపించింది. వెంటనే అతను ఆన్ లైన్ లో జెప్టోలో ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశాడు. స్థానికంగా ఉన్న.. యుమ్మో ఐస్‌ క్రీమ్స్‌ పార్లర్ నుంచి మూడు బటర్‌స్కాచ్ ఫ్లేవర్ కోన్‌ ఐస్‌క్రీమ్‌లను ఆర్డర్‌ పెట్టాడు. కాసేపటికి డెలివరీ బాయ్ వాటిని తీసుకురావడంతో ఎంతో ఇష్టంగా తినడం స్టార్ట్ చేశాడు. వావ్.. యమ్మీ అంటూ ఐస్ క్రీమ్ ను తింటూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంతలో నాలుకకు ఏదో గట్టి పదార్థం తగులుతున్నట్లు అనిపించింది. అది.. చాక్లెట్‌ ముక్క కావొచ్చని తొలుత భావించాడు. కానీ, ఎందుకో అతడికి సమ్ థింగ్ ఫిషీ.. అని అనుమానం కల్గింది.


వెంటనే ఐస్‌క్రీమ్‌ను నిశితంగా పరిశీలించడంతో 2 అంగులాల పొడవున్న మనిషి వేలు కనిపించింది. దీంతో ఒక్కసారిగా  షాక్ కు గురయ్యాడు. వెంటనే వీడియో తీసుకుని,  దగ్గరలోని పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఈ విషయం చెప్పాడు.  దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ వేలు ఉన్న ఐస్ క్రీమ్ ను తీసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు.


Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..


ఈ ఘటన మాత్రం స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. దీన్ని చూసిన నెటిజన్లు వామ్మో.. పొరపాటున కొరికి తింటే అతని పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అది నిజయంగా మనిషిదేనా.. లేదా ఏదైన టిడ్డీ బేర్ దా అంటు మరీకొంత మంది కామెంట్లు పెడుతున్నారు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter