Mysterious Temple Story In India:  భారతదేశ అనేక పురాతన దేవాలయాలకు పుట్టినిల్లు. ఇందులో చాలావరకు 200 సంవత్సరాల క్రితం నిర్మించినవే ఉన్నాయి. అలాగే మరికొన్ని అయితే కొన్ని వేల సంవత్సరాల కింద నిర్మించిన గుడులు గోపురాలు ఉన్నాయి. వీటిల్లో చాలా ఆలయాల్లోని అప్పుడప్పుడు కొన్ని నమ్మలేని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఈ సంఘటనలు సైన్స్ కి సవాల్ విసిరిదమే కాకుండా.. చూసిన వారందరికీ వావ్ అనిపిస్తాయి. గత కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించిన అనేక దేవాలయాలు శిల్పసంపదకు ప్రసిద్ధిగా ఉన్నాయి. ఇలా చాలా శిల్ప సంపద ఉన్న దేవాలయాల్లో ఏదో ఒక మిస్టరీ జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి మిస్టరీ ఉన్న ఎంతో ప్రసిద్ధి కలిగిన ఆలయం ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉంది. ఈ ఆలయంలో ఉన్న గుడిలో నందిరీశ్వరుడు ఏ రోజుకు ఆ రోజు పెరుగుతూ ఉంటాడు. ఇలా పరిమాణం పెరగడం ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది. అయితే ఈ రహస్యం ఇప్పటికీ ఏ శాస్త్రవేత్త కనిపెట్టలేకపోయా. ఇలా ఏళ్ల నుంచి విగ్రహం పెరుగుతూ వస్తోంది. అంతేకాకుండా నంది విగ్రహం క్రమక్రమంగా పెరుగుతుందని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో కూడా ఎంతో క్లుప్తంగా వివరించాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఆలయం ఎక్కడ ఉందో మీకు తెలుసా? 
ఎంతో ప్రసిద్ధి చెందిన మిస్టరీ ఆలయాల్లో ఇది ఒకటి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఉంది. ఈ ఆలయానికి ఎంతో ప్రత్యేకమైన ప్రసిద్ధి ఉంది. దీనిని యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయంగా పిలుస్తారు. ఈ దేవాలయంలో సాక్షాత్తు పరమశివుడే కొలువుదీరి ఉన్నాడు. దీనిని విజయనగర సామ్రాజ్యంలోని రాజవంశీకులు 15వ శతాబ్దంలో నిర్మించారట. ఈ ఆలయం విజయనగర రాజుల సాంప్రదాయాలకు ఒక ప్రతిబింబంగా నిలుస్తుందని పూర్వికులు చెబుతున్నారు. పెరుగుతున్న నంది విగ్రహాన్ని చూసేందుకు ప్రతిరోజు వందలాదిమంది ఆలయాన్ని సందర్శిస్తారు.


ఇదీ చదవండి:  టాలీవుడ్ లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాలు.. ‘పుష్ప 2’ ప్లేస్ ఎక్కడంటే..


నంది విగ్రహం పెరుగుతోంది: 
అన్ని దేవతామూర్తులకు వాహనాలు ఉన్నాయి. నందిని పరమేశ్వరుడి వాహనంగా పిలుస్తారు. ప్రతి శివాలయంలో తప్పకుండా నందీశ్వరుడు ఉంటాడు. ఇలా యాగంటి ఆలయంలో కూడా ఓ నందీశ్వరుడు ఉన్నాడు. అయితే గతంలో శివుడిని ప్రతిష్టించిన తర్వాత ఈ ఆలయంలో నందీశ్వరుడు ని కూడా ప్రతిష్టించారు. శివుడికి ఎదురెదురుగా ఉన్నాయి. నందీశ్వరుడు దాదాపు 20 సంవత్సరాల నుంచి ఒక్కొక్క అంగుళం పెరుగుతూ వచ్చాడట. ఇప్పటికీ నందీశ్వరుడు పెరగడంతో ఆలయంలోని స్తంభాలన్నిటిని ఒక్కటొక్కటిగా తొలగిస్తున్నారని సమాచారం. అలాగే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో పేర్కొన్నట్లుగా కలియుగం అంతమయ్యేసరికి ఈ నందికి ప్రాణం వస్తుందని అక్కడి స్థానికులు కూడా చెబుతున్నారు.


ఇదీ చదవండి: ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరంజీవి డూప్ గా నటించింది వీళ్లా.. ఫ్యూజలు ఎగిరిపోవడం పక్కా..


ఇదీ చదవండి:  టాలీవుడ్ లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాలు.. ‘పుష్ప 2’ ప్లేస్ ఎక్కడంటే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.