Garba dance while reading video viral: ప్రస్తుతం దేశంలో దసర నవరాత్రులు వేడుకగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో అమ్మవారు ప్రతిరోజు ఆయా అవతారాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. అక్టోబరు 3 నుంచి 12 వరకు దసరా శరన్నవరాత్రులు కొనసాగనున్నాయి. అయితే.. దుర్గమ్మ తల్లి  ప్రతిరోజు ఒక అవతారంలో కన్పించి భక్తుల కోరికల్ని నెరవేరుస్తాయి. ఈ నేపథ్యంలో చాలా చోట్ల తొమ్మిదిరోజులు,రోజుకో నైవేద్యం కూడా సమర్పిస్తుంటారు.. అమ్మవారి అనుగ్రహాం కోసం భక్తులు పరితపిస్తుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



చాలా మంది అమ్మవారి పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత.. కోలాటం, గార్బా డ్యాన్స్ లు చేస్తుంటారు. దీనికి చిన్నా, పెద్ద తేడా లేకుండా యువత పాల్గొంటారు. ఫుల్ జోష్ తో అమ్మవారి పాటలకు డీజే పాటలకు డ్యాన్స్ లు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో.. ఒక అమ్మయిలు మంచి కాస్ట్యూమ్స్ లు ధరించి, యువతీ, యువకులంతా మాస్ స్టెప్పులు వేస్తు గార్బా డ్యాన్స్ చేస్తుంటారు. ఇటీవల ప్రతి చోట కూడా దుర్గా దేవీ మండపాల వద్ద గార్బా డ్యాన్స్ లు చేస్తున్నారు.


ప్రస్తుతం వైరల్ గా మారిన వీడియోలో.. ఒక యువకుడు ఒక వైపు గార్బా డ్యాన్స్ చేస్తున్నాడు. మరోవైపు చదువుకుంటున్నాడు. అక్కడ దుర్గాదేవీ మండపంలో.. యువతీ యువకులు ఫుల్ జోష్ గా డ్యాన్సులు చేస్తున్నారు. కానీ ఈ యువకుడు మాత్రం.. చదువుతూ పాటకు తగ్గట్టుగా అదిరిపోయే స్టెప్పులు వేస్తున్నాడు. గార్బా కార్యక్రమంలో.. బ్రౌన్ కుర్తా, జీన్స్ ధరించిన యువకుడు తన చేతుల్లో పుస్తకాన్ని పట్టుకుని గార్బా స్టెప్పులకు తగ్గట్లు డ్యాన్స్ లు చేశాడు.


Read more: Viral Video: బాప్ రే.. టూరిస్టు బస్సుపై జంప్ చేసిన చిరుతపులి.. షాకింగ్ వీడియో వైరల్..


అంతేకాకుండా.. పుస్తకంలో చదువుకుంటునే.. మరోవైపు డ్యాన్స్ కూడా చేస్తున్నాడు. అతగాడి పక్కనే మరో యువతి కూడా స్టెప్పులు వేయడం కన్పిస్తుంది.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు.. మాత్రం ఆశ్చర్యపోతున్నారు. అంతే కాకుండా.. ఇదేం డేడికేషన్ అంటూ ఫన్నీగా కామెంట్ లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం.. సివిల్స్ స్టూడెంట్ ఏమో.. అనుకుంటూ కూడా ఫన్నీగా మాట్లాడుకుంటున్నారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.