New Car Accident: డ్రైవింగ్ సరిగ్గా రాకముందే కొత్త కారు కొన్నాడు.. తర్వాత ఏమైందో మీరే చూడండి
Newly Purchased Car Accident: కారు డ్రైవ్ చేయడం అంటే చాలా మంది కేవలం గేర్ మార్చడం, స్టీరింగ్ తిప్పడం వరకు వస్తే చాలు అనుకుంటారు.. ఇక కారు డ్రైవింగ్ మొత్తం వచ్చినట్టే అని భావిస్తారు.
Newly Purchased Car Accident: కారు డ్రైవింగ్ అంటే గేర్ మార్చడం, స్టీరింగ్ తిప్పడం మాత్రమే కాదు.. ఇంకెంతో ఉంటుందనే విషయం ఏదో ఒక ఊహించని ఉపద్రవం ఎదురయ్యేంత వరకు తెలిసిరాదు. అలా ఏదో ఒక డ్యామేజీ జరిగిపోయాకా చేతులు కాలాకా ఆకులు పట్టుకున్నట్టు ఏం లాభం ఉండదు. అందుకే కారు నేర్చుకునేటప్పుడే ఎంతో శ్రద్ధ వహించాలి. కారును ఎప్పుడు, ఎక్కడ, ఎలా టర్న్ చేయాలి, తక్కువ స్పేస్ ఉన్నప్పుడు ఎంత జాగ్రత్త వహించాలి, పార్కింగ్ చేసే సమయంలో ఎలా గేర్ మార్చాలి, వాహనాన్ని ఎలా కంట్రోల్ చేయాలి.. ఇలా ఎన్నో మెళకువలు నేర్చుకున్న తర్వాతే కారు డ్రైవింగ్‌పై పూర్తిగా పట్టు సాధించినట్టు భావించాలి. లేదంటే ఇదిగో ఈ వీడియోలో చూసినటువంటి చేదు అనుభవమే ఎదుర్కోవాల్సి ఉంటుంది.
అపార్ట్‌మెంట్‌లో కారు పార్క్ చేయడానికి వచ్చిన ఒక వ్యక్తి.. బహుషా బ్రేక్ తొక్కబోయి యాక్సిలరేటర్ తొక్కినట్టున్నాడు కాబోలు.. ఇదిగో ఇలా తనకు తెలియకుండానే అక్కడ పార్క్ చేసి ఉన్న బైక్స్‌పైకి ఎక్కించేశాడు. అతడు కారును లోపలికి టర్న్ చేసిన తీరు చూస్తేనే అతడు కొత్తగా కారు నేర్చుకున్న వ్యక్తి అని అనిపించకమానదు. ఎందుకంటే విశాలమైన గేటులోంచి పక్కనే ఎంతో స్పేస్ ఉన్నప్పటికీ.. అతడు మాత్రం కారు సెక్యురిటీ పోస్టుకు దాదాపు ఢీకొంటుందా అనేంత తక్కువ స్పేస్‌లో లోపలికి టర్న్ చేశాడు.
కారు గేటులోపలికి ఎంటర్ అయ్యేటప్పుడే ఏదో తేడా కొట్టింది అని అనుకుంటుండగానే.. ఇదిగో ఇలా లోపల కారును నియంత్రించలేక పార్క్ చేసి ఉన్న బైక్స్‌పైకి ఎక్కించాడు. ఈ దృశ్యం అక్కడి అపార్ట్‌మెంట్ సీసీటీవీలో రికార్డయింది.
ఇదిలావుంటే, ఈ ప్రమాదంలో దెబ్బతిన్న ద్విచక్ర వాహనాల పరిస్థితేంటి, వాటి యజమానులు స్పందించే తీరు ఇంకెలా ఉంటుందనే కోణంలో నెటిజెన్స్ పలు మీమ్స్ పోస్ట్ చేశారు. అందులో ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ఆ మీమ్ చూస్తోంటే.. నిజంగానే ద్విచక్రవాహనదారుల రియాక్షన్ ఇలాగే ఉంటుందేమో అనుకునేలా ఉంది ఆ పోస్ట్.
అంత దురదృష్టంలోనూ అదృష్టం ఏంటంటే.. అతడు మాత్రం ఎలాంటి గాయాలబారినపడకుండా సురక్షితంగా ఈ ప్రమాదం బారి నుంచి బయటపడ్డాడు. అంతేకాదు.. ఒకవేళ కారు బోల్తా పడి ఉంటే.. డ్యామేజీ ఇంకా ఎక్కువే ఉండేది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొత్తగా కారు డ్రైవింగ్ నేర్చుకునే వాళ్లకు, పూర్తిగా కారు డ్రైవింగ్ రాకుండా కారు కొనే వారికి ఇదొక గుణపాఠంగా ఉపయోగపడుతుందంటున్నారు నెటిజెన్స్.
Also Read : Woman Dance Viral Video: డ్యాన్స్ చేస్తోన్న యువతి వెనకాలే వచ్చి ఎంత పని చేశాడు.. వీడియో వైరల్
Also Read : Ravan Riding Bike: బైక్ నడుపుతున్న రావణుడి వీడియో వైరల్.. ఇంతకీ అసలు మేటర్ ఏంటో తెలుసా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి