Newly Wed Husband And Wife Viral News: యూపీలోని హమీర్‌పూర్ జిల్లా రాట్‌కొత్వాలి ప్రాంతంలో పోలీసు స్టేషన్‌కి వెళ్లిన ఓ వివాహిత.. స్టేషన్‌లో రచ్చరచ్చ చేసి నానా హంగామా సృష్టించింది. ఓవైపు అప్పటికే పెద్దలు జరిపించిన పెళ్లి చేసుకున్న ఆ మహిళ.. కొత్తగా తన ప్రేమికుడితో పెళ్లి చేసుకోవాలని దరఖాస్తు చేసుకుంది. ఇదే విషయమై పోలీసు స్టేషన్ లో వీరంగం వేసి పోలీసులకే ముచ్చెమటలు పట్టించింది. పోలీసులతో వాదిస్తూనే గట్టిగా కేకలు వేస్తూ అక్కడ ఉన్న కుర్చీలను విరగొట్టింది. ఒక మొబైల్ పగలగొట్టింది. ప్రేమికుడితో పెళ్లి జరిపించాల్సిందిగా పట్టుబడుతూ వీరంగం వేసిన ఈ మహిళను అదుపు చేసేందుకు మహిళా పోలీసులు చాలానే శ్రమించాల్సి వచ్చింది. మహిళ వేసే వీరంగం భరించలేక.. మహిళా పోలీసులు ఆమెను అదుపు చేసేందుకు అటూ ఇటు పరుగెత్తాల్సి వచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివాహిత డిమాండ్ ఏంటంటే..
మీడియాలో వచ్చిన వార్తా కథనాల ప్రకారం, బసేలా గ్రామానికి చెందిన అనిల్ శర్మ అనే యువకుడి భార్యనే ఈ కాజల్ శర్మ. ఉన్నట్టుండి పోలీసు స్టేషన్‌కి వచ్చిన కాజల్ శర్మ.. గత ఏడాది ఫిబ్రవరి 18న అనిల్ శర్మతో తనకి పెళ్లి అయిందని ఓపిగ్గానే చెప్పింది. అయితే, ఇప్పుడు తన మనసు మారిందని.. తాను తన భర్తతో కాకుండా తన ప్రేమికుడితోనే ఉండాలనుకుంటున్నాను అని పోలీసులకు చెప్పడంతో అసలు ఎపిసోడ్ మొదలైంది. కాజల్ శర్మ చెప్పిన విషయం విని పోలీసులకు ఫ్యూజులు ఔట్ అయినంత పనయింది. 


షాక్ నుంచి తేరుకున్న పోలీసులు నెమ్మదిగా ఆమెకు నచ్చజెప్పడం మొదలుపెట్టారు. హిందూ వివాహ చట్టం ప్రకారం ఒకసారి పెళ్లి చేసుకున్న వారు రెండో పెళ్లి చేసుకుంటే అది నేరం అవుతుంది అని ఆమెకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేశారు. సర్కిల్ ఆఫీసర్ సహా.. స్టేషన్ లో ఉన్న పోలీసులు అంతా ఆమెకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు కానీ వారి ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. పోలీసులు నచ్చచెబుతున్న సమయంలోనే ఆమె తీవ్ర అసహనానికి గురైంది. ఆ కోపంతోనే కుర్చీలను విరగ్గొట్టడం మొదలుపెట్టింది. నేలను కాళ్లతో తంతూ, చేతులతో కొడుతూ పోలీసులకు తన విశ్వరూపాన్ని చూపించింది. ఆ వివాహిత ఉగ్రరూపం చూసి పోలీసులే షాకయ్యారు.


ఆ వివాహితను ఎలా అదుపు చేశారంటే..
వివాహిత చేసిన అరాచకం చూసి పోలీసులకు ముచ్చెమటలు పోశాయి. పోలీస్ స్టేషన్‌లో విధుల్లో ఉన్న ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఆమెను అదుపు చేసేందుకు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ.. వారికి అది పెద్ద సవాలుగానే పరిణమించింది. ఎలాగోలా మహిళా కానిస్టేబుల్ ఆ వివాహితను అక్కడి నుంచి మరో పక్కకు లాక్కెళ్లడంతో పరిస్థితి కొంతమేరకు అదుపులోకి వచ్చింది. అప్పటికే పోలీసులు అందించిన సమాచారంతో ఆమె కుటుంబసభ్యులు అక్కడికి చేరుకోవడంతో ఆ వివాహితను కుటుంబసభ్యులకు అప్పగించి సైకాలజిస్టుకు చూపించి కౌన్సిలింగ్ ఇప్పించాల్సిందిగా సూచించారు. అందుకోసం తాము కూడా తమవంతు సహాయం అందిస్తామని తెలిపారు. మొత్తానికి సినిమాకు ఏ మాత్రం తగ్గని ఈ ఎపిసోడ్‌లో సదరు మహిళ యూపీ పోలీసులకు చుక్కలు చూపించింది.


ఇది కూడా చదవండి : Golden Treasure in Fort: స్వతంత్రం వచ్చిన 30 ఏళ్లకు పాకిస్థాన్ ప్రధాని కన్నేసిన కోట.. కోట నిండా 60 ట్రక్కుల రహస్య నిధి


ఇది కూడా చదవండి : Couple First Night Video: పొరపాటున సోషల్ మీడియాలో ఫస్ట్ నైట్ వీడియో పోస్ట్.. ఫుల్ వైరల్!


ఇది కూడా చదవండి : Couples Mud Photoshoot: బట్టలు తీసేసి.. బురదలో పండిబొర్లాడుతూ ఫోటోషూట్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK