Popcorn Bill = Amazon Prime Cost: తాజాగా త్రిదీప్ కె మండల్ అనే వ్యక్తి తనకే ఎదురైన ఓ చేదు అనుభవాన్ని ట్విట్టర్ హ్యాండిల్‌ ద్వారా నెటిజెన్స్‌తో షేర్ చేసుకున్నాడు. నోయిడాలోని మాల్ ఆఫ్ ఇండియా షాపింగ్ మాల్‌లో ఉన్న పివిఆర్‌కి సినిమాస్ మల్టిప్లెక్స్ థియేటర్‌కి వెళ్లగా.. అక్కడ పాప్‌కార్న్ కొంటే తన జేబు గుల్లయింది అని త్రిదీప్ తన ట్వీట్‌లో వివరించాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లాక్‌డౌన్‌ సమయంలో సినిమా థియేటర్స్ మూతపడటం, అదే సమయంలో ఓటిటి ప్లాట్‌ఫామ్స్ భారీగా పుంజుకోవడం ఒకేసారి జరిగింది. లాక్‌డౌన్ తరువాత కూడా కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకున్న నివారణ చర్యల్లో భాగంగా చాలా మంది థియేటర్లకి వెళ్లడం మానేశారు. ఇళ్లలోనే ఉండి ఓటిటి ప్లాట్‌ఫామ్‌లలో సినిమాలు ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. అయితే, అదంతా కరోనా ఆంక్షలు అమలులో ఉన్నప్పుడు జరిగింది. కానీ ఇప్పుడు ఎలాంటి ఆంక్షలు లేకుండా పరిస్థితి అంతా నార్మల్ అయినప్పటికీ.. చాలామంది థియేటర్లకు వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండి ఓటిటిలో సినిమాలు ఎంజాయ్ చేయడానికి అలవాటుపడ్డారు. 


ఏ ఆంక్షలు లేనప్పటికీ జనం థియేటర్లకు వెళ్లేంత ధైర్యం చేయకపోవడానికి మరో కారణం కూడా ఉంది. థియేటర్లలో టికెట్ రేట్ల నుంచి ఇంటర్వెల్లో సరదా కోసం కొనుక్కునే పాప్‌కార్న్, కూల్ డ్రింక్స్ వరకు ఏది టచ్ చేసినా ధరలు వాచిపోతున్నాయి. దీంతో డబ్బును లెక్కచేయని వారు తప్పితే.. ఒకటో తారీఖు కోసం వేచిచూసే సామాన్యులు ఎవ్వరైనా థియేటర్ ముఖం చూడాలంటేనే హడలిపోతున్నారు. తాజాగా త్రిదీప్ ఉదంతమే ఇందుకు సజీవ సాక్ష్యం. 


త్రిదీప్ కె మండల్ తన కుటుంబంతో కలిసి సినిమా చూడటానికి వెళ్లాడు. ఇంటర్వెల్ గ్యాప్‌లో కుటుంబం కోసం చిన్న సైజ్ ఉన్న జున్ను పాప్‌కార్న్, అదే పరిమాణంలో పెప్సీని కొనుగోలు చేయాలనుకున్నాడు. అక్కడి ఫుడ్ వెండార్ ఇచ్చిన బిల్లు చూసి ఘోల్లుమన్నాడు. సహజంగానే వృత్తిరీత్యా జర్నలిస్ట్ అయిన త్రిదీప్, చాలా తెలివిగా ట్విటర్‌లో షేర్ చేసుకున్నాడు. పాప్ కార్న్, కూల్ డ్రింక్ కోసం తాను చెల్లించిన మొత్తం ఒక సంవత్సరం అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్‌కి సమానం అని తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.



ఇది కూడా చదవండి : 7 members On 1 Bike: ఒక్క బైకుపై ఏడుగురి ప్రయాణం.. వీడియో వైరల్..


" 55 గ్రాముల చీజ్ పాప్‌కార్న్‌కు రూ. 460 కాగా 600 Ml పెప్సీ కూల్ డ్రింకుకి రూ. 360 అయ్యాయి. ఈ రెండూ కలిపి మొత్తం రూ. 820 అయ్యాయి. అంటే అదే ధరలో అమెజాన్ యాన్వల్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. అందుకే జనం థియేటర్లకు వెళ్లడం మానేసి ఓటిటిల్లో సినిమాలు చూస్తున్నారు అనే విషయాన్ని త్రిదీప్ చెప్పుకొచ్చాడు. ఒక విధంగా ఆలోచిస్తే త్రిదీప్ మాటల్లోనూ వాస్తవం ఉంది కదా అని అంటున్నారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ట్వీట్‌ని చూసిన వాళ్లు. అంతేకాదు.. చాలామంది ఈ ట్వీట్‌తో ఏకీభవిస్తూ తమకు కూడా సినిమా థియేటర్లో ఇలాంటి అనుభవమే ఎదురైంది అంటూ కామెంట్స్ రూపంలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. మొత్తానికి త్రిదీప్‌తో ఏకీభవిస్తోన్న వారి సంఖ్య పెరుగుతోంది.


ఇది కూడా చదవండి : Lion Vs Farmer Video: ప్రాణాలకు తెగించి పులి నోటి నుంచి ఆవును రక్షించిన రైతు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK