Noodles Pani Puri: పానీ పూరి అంటే ఎవరికి మాత్రం ఇష్టముండదు.. చాలామంది లొట్టలేసుకుంటూ ప్లేట్లకు ప్లేట్లు లాగించేస్తుంటారు. అయితే ఇప్పుడు చెప్పబోయే కాంబినేషన్‌లో పానీ పూరి తినడానికి మాత్రం కాస్త గుండె ధైర్యం కావాలి. సాధారణంగా పానీ పూరి అంటే.. పూరిలో కాస్త చోలే మసాలా పెట్టి రసం కాంబినేషన్‌తో సర్వ్ చేస్తారు. కానీ, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. మ్యాగీ న్యూడల్స్ పెట్టుకొని తింటున్నారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదెంటో మీరే చూసేయండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుడ్ వీడియోలు విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంటున్నాయి. కొత్త కొత్త రకాల వంటలతో పలువురు యూట్యూబర్లు నెటిజన్లను ఆకర్షిస్తున్నారు. ఆ వీడియోల ద్వారా ఎన్నో వ్యూస్ వస్తున్నాయి. ఇదే ట్రెండ్ ను ఫాలో అవుతూ పలువురు యూట్యూబర్లు కొత్త వంటకాలను తమ యూజర్లకు పరిచయం చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడో వీడియో సోషల్ మీడియాలో 'మ్యాగీ పానీపూరీ' నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. వైరల్ అవుతున్న వీడియో చూసిన నెటిజన్లు షాక్ కు గురవుతున్నారు. 



చోలేకు బదులుగా మ్యాగీ నూడుల్స్


పానీ పూరి అమ్ముకునే ఓ వ్యాపారి తమ కస్టమర్ల కోసం మ్యాగీ నూడుల్స్ తయారు చేశాడు. ఆ నూడుల్స్ ను పానీ పూరిలో పెట్టి రసం వేసి సర్వ్ చేశాడు. ఆ టేస్టు ఎలా ఉందో తెలియదు కానీ.. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. 'మ్యాగీ పానీపూరి' వీడియో @Iyervval అనే ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పటివరకు 77,000 పైగా వ్యూస్ ను దక్కించుకుంది. వేలల్లో కామెంట్స్ లభించాయి.  


Also Read: Eagle vs Snake Fight: గద్దపై ప్రతికారంతో విరుచుకుపడిన చిన్న పాము - వీడియో వైరల్


ALso Read: Lucky Lottery Ticket: లవర్స్ డే రోజు లాటరీ టికెట్ గిఫ్ట్ ఇచ్చిన భర్త.. కోపడ్డ భార్య.. కట్ చేస్తే రూ. 10 కోట్లు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook