Coromandel Express Horrific Video: ఒడిషా రైలు ప్రమాదం దుర్ఘటన ఎంతో మందిని అయినవారికి దూరం చేసింది .. ఎన్నో జీవితాల్లో చీకటిని నింపింది ... ఎంతోమందిని శాశ్వతంగా అంగవైకల్యం బారినపడేసింది .. ఎన్నో జీవితాలకు చేదు అనుభవాన్ని మిగిల్చింది .. ఇవన్నీ ఇంకా మర్చిపోక ముందే తాజాగా కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు బోగీల్లో ఒక బోగీలో స్వీపర్ బోగీని క్లీన్ చేస్తూ ఉన్న సమయంలోనే రైలు ప్రమాదానికి గురైంది. సరిగ్గా ప్రమాదం జరగడానికి 25 సెకన్ల ముందు రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అప్పటి వరకు అంతా మామూలుగానే ఉండగా.. ఎప్పుడైతే రైలు ప్రమాదం జరిగిందో సరిగ్గా అదే క్షణం నుంచి వీడియో మొత్తం డిస్టర్బ్ అయినట్టుగా ఉండటం ఈ దృశ్యాల్లో చూడొచ్చు. 

కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలులో స్లీపర్ కోచ్‌ లో రికార్డు చేసిన ఈ వీడియోను గమనిస్తే.. కొంతమంది ప్రయాణికులు నిద్రిస్తుండటం చూడొచ్చు. అంటే చాలామంది నిద్రలో ఉండగానే తాము ప్రమాదం బారిన పడుతున్నట్టు తెలిసేలోగానే ప్రాణాలు కోల్పోయారని అర్థం అవుతోంది. ఒడిషా రైలు ప్రమాదం దుర్ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మంగళవారం నుంచే విచారణ చేపట్టింది. ఐపీసీ సెక్షన్లు 337, 338, 304A, 34, 153, 154, 175 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ.. దుర్ఘటన జరిగిన తీరుని నిశితంగా పరిశీలిస్తోంది.