COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gulab Jamun With Old Monk Viral Video: మారుతున్న జీవన శైలి కారణంగా ప్రతి ఒక్కరు ఆహార పదార్థాలను విభిన్నంగా తినేందుకు ఇష్టపడుతున్నారు. కొందరు స్పైసీ ఫుడ్ తింటే మరికొందరు తీపి పదార్థాలను ఎక్కువగా తింటూ ఉంటారు. మరికొందరైతే దానికి భిన్నంగా అన్ని ఆహార పదార్థాలను మిక్స్ చేసి తినడం మనం అరుదుగా చూస్తాం. అయితే ఇటీవలే వైరల్ అవుతున్న వీడియో సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ వీడియోలో గులాబ్ జామ్, రమ్ రెండు ఇష్టపడే ఓ వ్యక్తి ఏం చేశారో మీరే చూడండి..


వీడియో చూసినట్లయితే ఓ వ్యక్తి పెద్ద చెంచను తీసుకొని అందులో రెండు గులాబ్ జాములు వేసి.. కొంత తీయని గులాబ్జామ్ రసాన్ని కూడా అందులో వేస్తాడు. అయితే ఇదే క్రమంలో ఓల్డ్ మంక్ రమ్ ను కూడా అందులో పోస్తాడు. ఇలా రెండింటిని మిక్స్ చేసి వాటిని సిలిండర్ పై వేడి చేస్తాడు. ఇలా వేడి చేసిన తర్వాత సర్వ్ చేసుకుని వాటిని తింటాడు. ప్రస్తుతం చాలామంది ఇలా మిక్స్ చేసుకొని తినేందుకు ఇష్టపడుతున్నారు.


మీరు ఈ వీడియోని గమనించినట్లయితే గులాబ్ జామ్ లో ఓల్డ్ మంక్ రమ్ ను పోసి.. ఆ చెంచను సిలిండర్ పై పెట్టగానే ఓ చిన్న మంట వస్తుంది. దీంతో గులాబ్ జామ్ టెస్ట్ మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలా ట్రై చేయడం ఆరోగ్యానికి చాలా హానికరం. కాబట్టి ఇలా ఆహార పదార్థాలను ఆల్కహాల్తో మిక్స్ చేసి తినే క్రమంలో తప్పకుండా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.





ఐస్ క్రీమ్ మిక్స్:
ప్రస్తుతం ఐస్ క్రీమ్ షాప్స్ లో పై విధంగానే అన్ని ఆహార పదార్థాలను కలిపి మిక్స్ చేసిన ఐస్ క్రీమ్లను విక్రయిస్తున్నారు. ఇవి విభిన్న రుచుల్లో లభిస్తున్నాయి. వీటిని విచ్చలవిడిగా తీసుకుంటే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను, మిక్స్ చేసిన ఆహారాలను తీసుకోకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


Also Read : Yashoda Twitter Review : యశోద ట్విట్టర్ రివ్యూ.. దుమ్ములేపిన సమంత.. కష్టానికి తగ్గ ప్రతిఫలం


Also Read : Pushpa 2: ప్రారంభమైన పుష్ప 2 షూటింగ్, పుష్ప 2లో ఆర్ఆర్ఆర్ సీన్ రిపీట్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook