Viral News: అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ విమానం ప్రమాదానికి గురయ్యింది. టేకాఫ్‌ సమయంలో కొన్ని పరికరాలను ఢీకొట్టడంతో కింది భాగం దెబ్బతింది. పెద్ద రంధ్రం ఏర్పడింది. విమానం కుదుపులకు లోనయ్యింది. ఏం జరుగుతుందో తెలియక విమానంలోని ప్రయాణికులు భయాందోళన చెందారు. గంటపాటు అలాగే గాల్లో ఎగిరి సురక్షితంగా ల్యాండయ్యింది. దీంతో ప్రయాణికులంతా 'దేవుడా' అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన సెర్బియాలోని బెల్‌గ్రేడ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Dengue Fever: మంత్రికి డెంగీ వ్యాధి.. మేడారం జాతర ఎలా జరుగునోనని ఆందోళన..


మారథాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎబ్రెయిర్‌ ఈ-195 విమానం ఆదివారం (ఈనెల 18) బెల్‌గ్రేడ్‌లోని నికోలా టెస్లా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జర్మనీలోని డసెల్‌డార్ఫ్‌కు బయల్దేరింది. టేకాఫ్‌ అయ్యే సమయంలో చేరుకోవాల్సిన ఎత్తుకు విమానం ఎగరకపోవడంతో రన్‌ వే చివర్లో ల్యాండింగ్‌ సిస్టమ్‌ అరె పరికరాలను ఢీకొట్టింది. దీంతో విమానం ఎడమ వైపు రెక్క భాగం తీవ్రంగా ధ్వంసమైంది. 106 మంది ప్రయాణికులతో విమానం బయల్దేరింది. ఈ ప్రమాదాన్ని గ్రహించి అధికారులు వెంటనే సమాచారం ఇవ్వడంతో వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించారు. 

Also Read: Ali Will Contest: సీఎం జగన్‌ ఫోన్‌ కోసం ఎదురుచూస్తున్నా.. ఎక్కడైనా పోటీకి 'సిద్ధం' అంటున్న నటుడు అలీ


ఇదే క్రమంలో విమానం కింద భాగం రంధ్రం పడింది. విమానం కింది భాగం చీలిపోయినట్లు కనిపిస్తోంది. ఇక తోక భాగం కూడా దెబ్బతింది. ఈ ప్రమాదంతో విమానం కొంత కుదుపునకు లోనయ్యింది. దెబ్బతిన్న విమానం గాల్లో అలాగే చక్కర్లు కొట్టింది. కొన్ని నిమిషాల అనంతరం అధికారులు గుర్తించారు. విమానం నుంచి ఇంధనం లీక్‌ అవుతున్నట్లు గుర్తించి వెంటనే చర్యలు తీసుకున్నారు. అయితే ప్రమాదమేమి సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇంధనం లేకపోవడంతో బెల్‌గ్రేడ్‌ ఎయిర్‌పోర్టును కొన్ని నిమిషాల పాటు మూసివేశారు. రంధ్రం, విమానం దెబ్బతిన్న వీడియో, ఫొటోలు బయటకు వచ్చాయి. వాటిని చూసి నెటిజన్లు నివ్వెరపోయారు. ఇంత దారుణంగా విమానం ఎలా నడిపారా అని ప్రశ్నిస్తున్నారు. కాగా ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
 




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook