Passengers Fight each other in eva air taiwan to san francisco:సాధారణంగా కొన్నిసార్లు ప్రయాణాలలో ఊహించని ఘటనలు జరుతుంటాయి. బస్సులు, ట్రైన్ లు, ఫ్లైట్లలలో ప్రయాణిస్తుంటాం. బస్సులలో సీటు కోసం, టికెట్ల కోసం, కొట్టుకొవడం వంటి ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. కొన్ని చోట్ల మహిళలు ఒకరిపై మరోకరు దాడులు చేసుకుంటుంటే, మరికొన్నిచోట్ల పురుషులు కూడా తమ భార్యల కోసం సీట్లు కావాలంటూ వాగ్వాదానికి దిగుతున్నారు. ముఖ్యంగా మహిళలు జుట్లు పట్టుకుని, చీరలు చింపుకుంటూ కొట్టుకోవడం వంటి ఘటనలు వార్తలలో నిలుస్తున్నాయి. ఇక కొందరు రైళ్లలో కూడా గొడవలు పడిన ఘటనలు మనం తరచుగా చూస్తుంటాం. ఒకరి సీట్లలో మరోకరు కూర్చుండటం, టికెట్ తీసుకోకుండా ట్రైన్ లోకి ప్రవేశించడం వంటి ఘటనలు మనం వార్తలలో చూశాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక..ఇటీవల విమానాలలో కూడా వింత వింత ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. విమానాలలోకూడా రాత్రి మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, లేడీ హోస్టెస్ ల పట్ల వివాదాస్పందంగా ప్రవర్తించి, ప్రయాణికులు గొడవలు పెట్టుకుంటున్న ఘటనలు అనేకంజరిగాయి. కొందరు కావాలని ఒకరిపై మరోకరు దాడులు చేసుకుంటూ, బూతులు తిట్టుకుంటున్నారు. బస్సులో, ట్రైన్ లలో నే కాకుండా.. ఇప్పుడు విమానంలో కూడా పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఈకోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.


 




ఇటీవల తైవాన్ లో చోటుచేసుకున్న ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. తైవాన్ నుంచి ఈవీఏ విమానం ఇటీవల..శాన్ ఫ్రాన్సిస్కోకు బయలు దేరింది. విమానంలో ప్రయాణికులంతా తమ తమ సీట్లలో కూర్చున్నారు. ఇంతలో ఇద్దరు వ్యక్తులు ఒకరితో మరోకరు గొడవకు దిగారు. ఒకర్నిమరోకరు నోటికొచ్చినట్లు తిట్టుకున్నారు. అంతటితో ఆగకుండా.. పిడిగుద్దులు కూడా కురిపించుకున్నారు. ఒక్కసారిగా ఫ్లైట్ లో ఉన్న వారంతా టెన్షన్ కు గురయ్యారు. విమానంలో ఎయిర్ హోస్టెస్ లు చెపుతున్న కూడా ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. అక్కడున్న ప్రయాణికులు కూడా ఇద్దరిని సముదాయించే ప్రయత్నంచేస్తున్నారు. వారిద్దరికి మధ్య సీటు విషయంలో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


దీన్ని చూసిన నెటిజన్లు ఇదేందిరా నాయన అంటూ నవ్వుకుంటున్నారు. అంతేకాకుండా.. హుందాగా ఉండాల్సిన విమానంలో ఇలా ప్రవర్తించడంమేంటని మండిపడుతున్నారు. మరికొందరు నెటిజన్లు వీరిని డోర్ తీసి కొంద తోసేయండి అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ఈ ఘటన మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter