Road Accident victim carried on JCB: ఆకాశంలోకి రాకెట్లు లాంచ్ చేస్తున్నాం.. చంద్రుడిపై కాలిడుతున్నాం.. వేరే గ్రహాలపై మానవ మనుగడకు అవకాశాలను వెతుక్కుంటున్నాం.. కానీ మన భూమి మీద ప్రాణపాయ స్థితిలో ఉన్న వారిని రక్షించుకునేందుకు సకాలంలో అంబులెన్స్ ని మాత్రం అందుకోలేకపోతున్నాం. ఒకవేళ అంబులెన్స్ సకాలంలో వచ్చినా.. సకాలంలో ఆస్పత్రికి చేరుకోలేకపోతున్నాం. ఈ దుస్థితికి అద్దం పడుతూ తాజాగా రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ యువకుడిని అంబులెన్స్‌కి బదులుగా జేసీబీ వాహనం ముందుండే బకెట్‌లో తరలించిన వైనం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంబులెన్స్ సకాలంలో రాకపోవడంతో ఏం చేయాలో అర్థం కాని స్థానికులు ఆ యువకుడిని జేసీబీలో ఆస్పత్రికి తరలించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఘటనపై చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ప్రదీప్ ముదియ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడిని ఆస్పత్రికి తరలించేందుకు 108 కు కాల్ చేశారని.. అయితే, అక్కడికి అంబులెన్స్ సకాలంలో రాకపోవడంతో ఇలా జేసీబీ బకెట్ లో తీసుకొచ్చారని అన్నారు. 108 సేవలు అందించే సంస్థ మారడంతో అంబులెన్స్ ని ఏర్పాటు చేయడంలో ఆలస్యమైందని ప్రదీప్ వివరించారు. సమీపంలో ఉండే మరో పట్టణం నుంచే అంబులెన్స్ సేవలు అందిస్తున్నామని.. అందువల్లే అంబులెన్స్ రాకలో జాప్యమైందన్నారు. కొత్త అంబులెన్స్ కోసం ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. 



మధ్యప్రదేశ్‌లో కట్నీలో చోటుచేసుకున్న ఈ ఘటన గురించి జేసీబీ యజమాని పుష్పేంద్ర విశ్వకర్మ మీడియాతో మాట్లాడుతూ.. కితోలికి వెళ్లే రోడ్డుపై జరిగిన ప్రమాదంలో సదరు యువకుడికి గాయాలై కాలు విరిగిందని.. అతడు కాలు నొప్పితో బాధపడుతున్నప్పటికీ.. అంబులెన్స్ సకాలంలో రాలేదు. రెండు, మూడు ఆటో రిక్షాలు అటు వైపు వచ్చినప్పటికీ.. వారు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు తిరస్కరించారు. దీంతో తానే తన జేసీబీ సహాయంతో అలా ఆస్పత్రికి తరలించాల్సి వచ్చిందని అన్నారు. పుష్పేంద్ర విశ్వకర్మ వ్యాపారం నిర్వహించే దుకాణం ఎదుటే ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఏదేమైనా అంబులెన్స్ లేని కారణంగా ఇలా రోడ్డు ప్రమాదం బాధితుడిని జేసీబీలో తరలించారన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


Also Read : OMG Video: సఫారీ జీప్ పైకి దూసుకొచ్చిన ఏనుగు, రెప్పపాటులో తప్పించుకున్న టూరిస్టులు..


Also Read : Elephant Car Viral Video: ఏనుగుకి దురద వేస్తే ఇట్లనే ఉంటది మరి.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి