Peacock Funny Video: ఇంటర్నెట్ అనేక వీడియోలు ఎప్పుడూ ట్రెండ్ అవుతుంటాయి. వాటిలో అనేక ఫన్నీ వీడియోలు, షాకింగ్ వీడియోస్ కూడా ఉంటాయి. వీటితో పాటు కొన్ని మన మనసుకు హత్తుకుంటాయి.. మరికొన్ని బాధపెడతాయి. సోషల్ మీడియాలో ఇలాంటి ఎన్నో రకాల వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్ గా మారుతాయి. అయితే ఇటీవలీ కాలంలో జంతువులు, పక్షుల వీడియోలు విపరీతంగా ట్రెండింగ్ అవుతున్నాయి. అలాంటి ఓ ఆసక్తికరమైన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అదేంటో మీరే చూసేయండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ వీడియోలో ఏముంది?


ప్రకృతిలో ఉన్న జంతువులను, పక్షులపై మనం ప్రేమను చూపిస్తే.. అవి తిరిగి మనకు ప్రేమను కురిపిస్తాయి. కానీ, కొన్ని సార్లు వాటితో అనుచితంగా ప్రవర్తిస్తే అవి మనపై తిరిగి దాడి చేస్తాయి. ఎందుకంటే అది ప్రకృతి ధర్మం. అలా మనుషులపై జంతువులు, పక్షులు దాడి చేసే వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్ గా మారుతుంటాయి. అలాంటి ఓ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. 



సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ప్రకారం.. ఓ నిర్మానుష ప్రదేశంలో నెమలి గుడ్లు పెట్టింది. ఆ గుడ్లను కాపాడుకుంటూ మగ నెమలితో అక్కడ నివసిస్తుంది. ఈ నేపథ్యంలో అటుగా వచ్చిన ఓ వ్యక్తి ఆడ నెమలి కింద ఉన్న గుడ్లను దొంగిలించేందుకు ప్రయత్నిస్తాడు. దాన్ని గమనించిన మగ నెమలి.. ఆ వ్యక్తిపై అమాంతం దాడికి తెగబడింది. మగ నెమలి దాడి చేయడం వల్ల ఆ వ్యక్తి వెంటనే కింద పడిపోయాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 


ఈ వీడియోను naturalpixm అనే ఇన్ స్టాగ్రామ్ ఖాతా నుంచి పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన కొందరు.. వెల్డన్ బర్డ్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోకు ఇన్ స్టాగ్రామ్ లో అనేక లైక్స్ సహా వేలల్లో వ్యూస్ లభించాయి.  


Also Read: Viral Video: ఏనుగును పరుగులు పెట్టించిన అడవి దున్న, ఫన్నీ వీడియో వైరల్


Also Read: Panda Funny Video: క్యూటీ పాండా ఇందులో ఏం చేస్తుందో చూడండి- వీడియో వైరల్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook