Pet Dog Gave Birth To 9 Puppies in UP: తాము పెంచుకున్న ఓ కుక్క ఒకేసారి 9 కుక్క పిల్లలకు జన్మనివ్వడంతో ఓ మహిళ ఆనందంతో గెంతులేసింది. ఏకంగా ఊరందరికీ గ్రాండ్ పార్టీ ఇచ్చింది. ఊరంత భోజనాలు పెట్టి.. సంబరాలు చేసుకుంది. అంతేకాకుండా మహిళలకు పాటల కచేరీ కూడా నిర్వహించింది. దాదాపు 400 మందికి ఆమె భోజనాలు పెట్టించడం విశేషం. ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. మేరాపుర్‌ గ్రామానికి రాజ్‌కాళి అనే మహిళ ఓ కుక్కను పెంచుకుంటోంది. దానికి చట్నీ అని పేరు పెట్టుకుని.. అల్లారుముద్దగా చూసుకుంటోంది. ఆ కుక్క ఇటీవల 9 కుక్క పిల్లలకు జన్మనిచ్చింది.
దీంతో తెగ సంబరపడిపోయిన ఆమె.. ఊరందరినీ పార్టీకి పలిచింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బుధవారం గ్రామస్థులు, బంధువులను పిలిచి విందు ఏర్పాటు చేసింది. అంతేనా అనుకుంటే పొరబడినట్లే. ఆ కుక్క పిల్లలను అందంగా ముస్తాబు చేసి.. ఉయ్యాలలో వేసింది. మహిళలతో జోల పాటలు పాడించింది. ఈ విషయంపై రాజ్ కాళి మాట్లాడుతూ.. తాను ఈ కుక్కను ఇంట్లో పెంచుకున్నప్పటి నుంచి తన కష్టాలు చాలా వరకు దూరమయ్యాయని తెలిపారు. చట్నీ ఒకేసారి 9 కుక్కపిల్లలకు జన్మనివ్వడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సాధారణంగా ఒక కుక్క 4 నుంచి 6 పిల్లలకు మాత్రమే జన్మనిస్తుండగా.. తన కుక్క 9 పిల్లలకు జన్మనివ్వడంతో రాజ్ కాళి ఆనందం తట్టుకోలేకపోయారు. అందుకే గ్రామస్థులు అందరికీ ప్రత్యేక ఆహ్వానం పలికి సంబరాలు చేసుకుంది.


ఈ సందర్భంగా అతిథుల కోసం పూరీలు, కూరగాయలు, అన్నం, మిఠాయిలు తయారు చేయించింది. మహిళలు డప్పు వాయిద్యాలతో పాటలు పాడారు. మొదట్లో ఈ సీన్ చూసిన చాలా మంది ఈ ఇంట్లో పెళ్లి ఉందనుకున్నారు. అయితే ఈ పార్టీ వెనుక అసలు కారణం తెలియగానే పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గతంలో పెంచుకున్న కుక్కలు పెద్దవ్వగానే ఆమెను విడిచివెళ్లిపోయాయి. అయితే చట్నీ మాత్రం రాజ్ కాళిని వీడిచివెళ్లలేదు. అందుకే ఆమెకు చట్నీ అంటే విపరీతమైన ప్రేమ. బుధవారం సాయంత్రం నుంచి రాజ్‌కాళి ఇంటికి అతిథులు రాగా.. అర్ధరాత్రి వరకు కార్యక్రమం కొనసాగింది.   


Also Read: Aiwa 65 Inch Qled Tv Price: దీపావళి ప్రత్యేక ఆఫర్స్‌..Aiwa 65 Inch Qled స్మార్ట్ టీవీపై 42 శాతం తగ్గింపు!  


Also Read: Diwali Mobile Offers 2023: దీపావళి మొబైల్స్‌ ఆఫర్స్‌..40 శాతం తగ్గింపుతో లభించే స్మార్ట్ ఫోన్స్‌ ఇవే!   


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook